ఫొటోలు: శ్రీశాంత్‌తో హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్
చెన్నై: స్పాట్ ఫిక్సింగ్‌లో శ్రీశాంత్ సహా ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అరెస్టయిన వెంటనే వారి సంబంధాలపై రకరకాల పుకార్లు ముందుకు వచ్చాయి. వారికి ఎవరితో సంబంధాలున్నాయనే విషయాన్ని ఆరా తీయడం ప్రారంభించారు. సినీ తారలకు వారికి సంబంధాలున్నాయనేది ప్రధానమైన విషయంగా ముందుకు వచ్చింది. గతంలో కొంత మంది సినీ తారలు భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతోనూ శ్రీశాంత్‌తోనూ సంబంధాలు పెట్టుకున్న విషయాలు ముందుకు వచ్చాయి.
శ్రీశాంత్‌తో తనకు సంబంధం లేదని లక్ష్మీరాయ్ ప్రకటించింది. మూడేళ్ల క్రితం శ్రీశాంత్‌తో మాట్లాడినట్లు చెప్పింది. తన పేరును శ్రీశాంత్ పేరుతో ఎందుకు జోడిస్తున్నారో తెలియడం లేదని ఆమె గుర్రుమంది. ఇది తన ప్రతిష్టను, వ్యక్తిగత జీవితాన్ని దెబ్బ తీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందువల్ల తన పేరును శ్రీశాంత్‌తో జోడించవద్దని ఆమె కోరింది.
మొదటి ఐపియల్ తర్వాత తనకు ఐపియల్‌తో ఏ విధమైన సంబంధం లేదని ఆమె ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో చెప్పింది. తన ప్రతిష్టకు భంగం కలిగించకూడదని, శ్రీశాంత్‌తో తనకు సంబంధాలను అంటగట్టవద్దని ఆమె కోరింది.

మొదటి ఐపియల్‌లో నయనతారతో పాటు లక్ష్మీరాయ్ చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. సినీ రంగంలో బిజీ కావడంతో ఆ తర్వాత ఆమె ఐపియల్‌తో సంబంధాలు పెట్టుకోలేదు.

తొలి ఎడిషన్ తర్వాత కొన్ని మ్యాచుల సందర్భంగా ఆమె దర్శనమిచ్చినట్లు, శ్రీశాంత్‌ను సపోర్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.

కేరళ జట్టు యజమాని అయిన డైరెక్టర్ ప్రియదర్శన్ ఆహ్వానించారని, ఆయన మాటను కాదనలేకపోయానని లక్ష్మీరాయ్ చెప్పింది.

శ్రీశాంత్, లక్ష్మీరాయ్ కలిసి ఓ ఫోటో షూట్‌లో కొన్నేళ్ల క్రితం పాల్గొన్నారు. దాంతో వారి మధ్య అఫైర్ ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది. ఆ విషయం మీడియాలో కనిపించడంతో దుమారం చెలరేగింది.

మరో వ్యక్తితో స్నేహం కుదరడంతో శ్రీశాంత్‌తో లక్ష్మీరాయ్ తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వ్యక్తి వ్యాపారి అని, స్నేహపూర్వకమైన, ఉల్లాసకరమైన, మంచి మనసు గలవాడని చెప్పింది.


Click it and Unblock the Notifications











