రిలాక్సింగ్ మూడ్లో మహేష్ బాబు, ఫ్యామిలీతో పారిస్ వెకేషన్ (ఫోటోస్)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే వారం 'భరత్ అనే నేను' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ఉన్నంత కాలం బిజిబిజీగా గడిపే మహేష్... షూటింగ్ ముగిసిన తర్వాత సినిమా విడుదలయ్యే సమయానికి ఫ్యామిలీతో విదేశాల్లో వాలిపోతారు. గత కొన్ని సినిమాల నుండి మహేష్ బాబు ఇదే షెడ్యూల్ ఫాలో అవుతున్నారు. తాజగా 'భరత్ అనే నేను' విషయంలో కూడా దాన్ని కంటిన్యూ చేశారు.

పారిస్‌లో విహరిస్తున్న మహేష్ అండ్ ఫ్యామిలీ
మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన హాలిడే ట్రిప్స్ అన్నీ నమ్రతే ప్లాన్ చేస్తుంటారు. ఈ సారి సమ్మర్ వెకేషన్ కోసం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరాన్ని ఎంచుకున్నారు. ఆల్రెడీ పారిస్‌లో మహేష్ అండ్ ఫ్యామిలీ ల్యాండ్ అయింది. పారిస్ ట్రావెల్ డైరీస్ పేరుతో ఇందుకు సంబంధించిన ఫోటోలు నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

పిల్లలతో కలిసి మహేష్ బాబు
పారిస్‌లోని గ్రాండ్ పలాసిస్‌లో ఆర్టిస్ట్ అండ్ రొబోటిక ఎగ్జిబిషన్‌ను మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ సందర్శించారు. ఇక్కడ ఎగ్జిబిషన్ ఎంతో అద్భుతంగా ఉంది అని నమ్రత పేర్కొన్నారు.

క్రియేటివిటీ అదిరింది
రొబోటిక్ అండ్ ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్లో ఇన్ఫినిటీ ఆర్ట్. క్రియేటివిటీకి అద్దంపట్టేలా ఈ ఎగ్జిబిషన్లో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి అని నమ్రత వెల్లడించారు. గౌతమ్, సితార కలిసి దిగిన ఫోటోను ఆమె ఈసందర్భంగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

వారం పాటు పారిస్ పర్యటన
దాదాపు వారం పాటు పారిస్‌లో పర్యటించేలా మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమా విడుదలకు ముందు అంటే ఏప్రిల్ 17న తిరిగి ఇండియా వస్తారని, వచ్చిన వెంటనే మీడియా ప్రమోషన్లలో మహేష్ బాబు బిజీ అవుతారట.

భరత్ అనే నేను
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను' ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పొలిటికల్ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.

ఫస్ట్ కాపీ రిపోర్ట్స్ అదుర్స్
‘భరత్ అనే నేను' సినిమాకు సంబంధించి ఫస్ట్ కాపీ రిపోర్ట్స్ అదిరిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమాను మహేష్ బాబు ఫ్యామిలీ, స్నేహితులు చూశారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, టాలీవుడ్లో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే సత్తా ఉన్న సినిమా అని అంటున్నారు. ఈ నెలలో బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మ్రోగడం ఖాయం అంటున్నారు.


Click it and Unblock the Notifications











