ఆనందోత్సవం : మహేష్ తన తండ్రితో...ఫ్యామిలీతో భోజనం (ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ...కుటుంబం అంతా కలిసి భోజనం చేసారు. అంతా సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. కృష్ణ గారిని ఆనందపరిచారు. తండ్రితో తన సినిమాల గురించి మహేష్ మాట్లాడారు. తన మనవలతో కలిసి కృష్ణ గారు ఆటలాడుతున్నారు. ఆయన పుట్టిన రోజు చాలా సరదాగా గడిచిపోయింది. వీటికి సంభందించిన కొన్ని ఫొటోలను మీరు చూడబోయేది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం బ్రహ్మోత్సవం ముహూర్తం కార్యక్రమాలు జరుపుకుంది. ఇక నేటినుంచే అధికారికంగా షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు నిర్మాణ సంస్థ తెలిపింది. కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ...పోస్టర్ సైతం రిలీజ్ చేసారు.

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై ముహూర్తపు సన్నివేశాన్ని తెరకెక్కించారు.

ఆ విశేషాలతో ...ఫ్యామిలీ ఫొటోలు కొన్ని..

దర్శకుడు మాట్లాడుతూ....

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత మళ్లీ మహేష్‌తో ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది.

అదే కాన్సెప్టు...

'నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటాయి. అలాంటి అనేకమంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకొంటే అదే బ్రహ్మోత్సవం. అలాంటి వాతావరణం మా సినిమాలోనూ కనిపిస్తుంది''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ..

''మా సంస్థ నుంచి వస్తోన్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. జులై 10 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''ని నిర్మాతలు చెప్పారు.

ఎవరెవరు

సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి

శ్రీమంతుడు కూడా..

శ్రీమంతుడు కూడా..

ఆదివారం కృష్ణ జన్మదినం సందర్భంగా మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' టీజర్‌ కూడా విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక.

డైలాగు బాగుంది

డైలాగు బాగుంది

''నా పేరు హర్ష. నా దగ్గర లేనిది లేదంటుంటారు. కానీ నాకు కావల్సింది ఇంకేదో ఉంది. దాని కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుంటుంది. దత్తత తీసుకోవడమంటే జేబులో డబ్బులు తీసి, రంగులు, రోడ్లేయించి వెళ్లిపోతాననుకున్నారా...'' అంటూ మహేష్‌ శ్రీమంతుడు కోసం పలికిన డైలాగులు ఆకట్టుకొంటున్నాయి.

విడుదల ఎప్పుడు

విడుదల ఎప్పుడు

శ్రీమంతుడు టైటిల్‌ క్లాస్‌గా కనిపిస్తున్నా.. మాస్‌, యాక్షన్‌ అంశాలు ఈ చిత్రంలో కావల్సినన్ని ఉన్నాయనే విషయాన్ని ఈ ప్రచార చిత్రం చెప్పకనే చెబుతోంది. జులై 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నారు నిర్మాతలు.

అందుకే క్రేజ్

అందుకే క్రేజ్

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆగడు' తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X