»   » సెక్సీ బ్యూటీస్, త్రివిక్రమ్‌తో సెట్లో పవన్ ఇలా (ఫోటోలు)

సెక్సీ బ్యూటీస్, త్రివిక్రమ్‌తో సెట్లో పవన్ ఇలా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబందించిన రేవ్ పార్టీ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. 'ఇట్స్ టైం టు పార్టీ' అనే లిరిక్ తో సాగే ఈ పాట మాంచి జోష్ తో కూడుకుని కుర్రకారులో హుషారును రేకెత్తించేలా ఉంటుంది.

ఈ పాటలో పవన్‌తో పాటు సమంత, హంసా నందిని, ఖుషీ సినిమా ఫేం ముంతాజ్‌లు స్టెప్పులు వేయనున్నారు. గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సాంగు చిత్రీకరిస్తున్నారు. అంతుకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. ఖుషీ సినిమాలో సెక్సీ అందాలతో ప్రేక్షకుల మతి పోగొట్టిన ముంతాజ్...ఇప్పటికీ అదే సెక్సీతనం మెయింటేన్ చేస్తుండటం గమనార్హం.

ఈ చిత్రం ఆడియోను ఈ నెల 14న అభిమానుల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్లైడ్ షోలో ఫోటోలు, ఇతర వివరాలు..

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టులో తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

English summary
Mumtaj, Hamsa Nandi spotted at Pawan-Trivikram movie. The film’s shooting has reached final leg and the unit has commenced post-production works of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu