twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎ రొమాంటిక్ హారర్ స్టోరీ’ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీరామ్, నిరంజన, ఆయేషా నటీనటులుగా ఎస్.ఎస్.ప్రేమ్ దర్శకత్వంలో చంద్రశేఖర మూవీస్ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ బాషల్లో ఏక కాలంలో నిర్మితమవుతున్న చిత్రం ‘ఎ రొమాంటిక్ హారర్ స్టోరీ'. షేడ్ ఆఫ్ హారర్ అనేది ఉప శీర్షిక. వెంకట్ రామిరెడ్డి, రవిశేఖర్ నిర్మాతలు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుపుకుంటోంది.

    ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ‘ఎ రొమాంటిక్ హారర్ స్టోరీ' పేరుతోె, తమిళంలో ‘ఫిబ్రవరి 31' గానూ సైమల్టేనియస్‌గా తెరకెక్కుతోంది. కథ విషయానికొస్తే విహారయాత్ర కోసం ఐదు యువ జంటలు అడవిలోకి వెళ్తారు. అక్కడ ఉన్న ఓ గెస్ట్ హౌస్ లోకి వెళ్లిన వారు రొమాన్స్‌లో మునిగిపోయాక ఆ ఐదుగురు అమ్మాయిల్లోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. ఆపై ఏం జరిగింది, ఆ ఆత్మ ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    భయ పెడుతూ థ్రిల్

    భయ పెడుతూ థ్రిల్

    సినిమా ఆద్యంతం ఎంతో ఉత్కంఠతో రన్ అవుతూ ప్రేక్షకులను భయపెడుతూ థ్రిల్ చేస్తుందని తెలిపారు.

    షూటింగ్ వివరాలు..

    షూటింగ్ వివరాలు..

    హారర్, రొమాన్స్ మిళితమైన ఈ సినిమాని మొత్తం 40 రోజుల్లో ఖర్చుకి వెనకాడకుండా ఊటీ, చెన్నై, గోవా, బాంబే, హైదరాబాద్ లోని లొకేషన్లలో చిత్రీకరించడం జరిగింది.

    త్వరలో సెన్సార్

    త్వరలో సెన్సార్

    ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. ఇపుడు డబ్బింగ్ జరుగుతోంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి సెన్సార్‌కి పంపిస్తామని తెలిపారు.

    నవంబర్లో...

    నవంబర్లో...

    నవంబర్ రెండవ వారంలో లేదా మూడవ వారంలో దేశవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్, సంగీతం: ఎ.జె.అలీమీర్ జగ్, ఎడిటర్: ఆనంద్, ఆర్ట్: ప్రవీణ్, దర్వక పర్యవేక్షణ: ఆర్.విద్యాధరన్, నిర్మాతలు: కె.వెంకట్ రామిరెడ్డి, రవిశేఖర్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.ప్రేమ్.

    English summary
    A Romantic Horror Story is a Telugu Movie. Directed by S.S.Prem. Sriram, Niranjana, Ayesha in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X