కళ్యాణ్ రామ్ 'పటాస్' విజయయాత్ర (ఫొటోలు)
నెల్లూరు : 'పటాస్' సినిమా విజయవంతం కావడంతో ఆ చిత్ర యూనిట్ నెల్లూరు నగరానికి విచ్చేసింది. ఈ సందర్భంగా జిల్లా తెదేపా అధ్యక్షుడు రవిచంద్ర, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పమ్మిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నగరంలోని అయ్యప్ప గుడి సెంటర్ నుంచి వేదాయపాలెం, ఆర్టీసీ సెంటర్, వీఆర్‌సీ సెంటర్ల మీదుగా నర్తకి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అక్కడ హీరో కల్యాణ్‌రామ్, తెలుగు యువత నాయకులు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పటాస్ చిత్రం పదర్శితమవుతున్న శ్రీ మల్టిప్లెక్స్ థియేటర్‌కు చిత్ర బృందం వెళ్లింది.
దారి పొడవునా బాణాసంచా కాలుస్తూ, తెదేపా, ఎన్టీఆర్‌లను కీర్తిస్తూ ర్యాలీ సాగింది. థియేటర్‌లో చిత్ర బృందం ప్రేక్షకులతో విజయానందాన్ని పంచుకుంది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన అభిమానులు, ప్రేక్షకులకు కల్యాణ్‌రామ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హీరోతో పాటు నిర్మాత దిల్‌రాజు, సాయికుమార్ మిగిలిన చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఫొటోలు స్లైడ్ షోలో....

బ్యానర్ పై
నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకుడిగా నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘పటాస్'.

చాలా కాలం తర్వాత హిట్
ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ కు హిట్ రావటంతో చాలా ఆనందంగా ఉన్నారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.
.‘‘ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణతో మల్టీస్టారర్ చిత్రంలో నటిచండానికి నేను సిద్ధంగా ఉన్నాను'',అన్నారు.

విజయయాత్రలు
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయయాత్రను నిర్వహిస్తోంది.

ఎక్కడెక్కడకి
31న మార్నింగ్ షోకి నెల్లూరు, మ్యాట్నీకి ఒంగోలు, సాయంత్రం 4.30కి చిలకలూరిపేట, 6గంటలకు గుంటూరు, రాత్రి 9 గంటలకు తెనాలిలో ‘పటాస్' ఆడుతున్న థియేటర్లకు చిత్ర బృందం వెళ్లింది. అలాగే ఫిబ్రవరి 1న మార్నింగ్ షోకి గుడివాడ, మ్యాట్నీకి మచిలీపట్నం థియేటర్లకు వెళ్తోంది.

విజయవాడలో...
సాయంత్రం విజయవాడ సిద్ధార్థ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే ‘పటాస్' విజయోత్సవసభలో చిత్ర యూనిటంతా పాల్గొంటారు.

నెల్లూరులో...
ప్రత్యేకబస్సులో వచ్చిన నటులను నగర సరిహద్దుల్లో మేళతాళాలతో స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది.

పూర్ణ కుంభంతో
టీడీపీ సీనియర్ నేత పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నందమూరి కుటుంబ అభిమానులు స్వాగత తోరణాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ర్యాలీ
అనంతరం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ కొనసాగింది.

సిరి థియోటర్ లో..
సినిమా ప్రదర్శిస్తున్న సిరి మల్టీప్లెక్స్ థియేటర్‌లో జరిగిన విజయోత్సవంలో నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడారు.

పెద్ద పండుగ
పటాస్ సినిమా విజయవంతం కావటం నందమూరి కుటుంబానికి పెద్ద పండుగగా అభివర్ణించారు.

షేర్ గా ...
పటాస్ తరువాత ‘షేర్' అనే సినిమాలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు

దిల్ రాజు హ్యాపీ
ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ..కలెక్షన్స్ బాగున్నాయని అన్నారు.

ఉత్సవంలా
ఈ విజయయాత్ర ఓ పెద్ద ఉత్సవంలా సాగింది.

ఈ కార్యక్రమంలో ....
మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, హరి ఫిలింగ్ డిస్టిబ్యూటర్స్ హరి, సుధీర్, టీడీపీ నేతలు మండవ రామయ్య, పడవల కృష్ణమూర్తి, పట్టాభిరామిరెడ్డి, వేలాది మంది నందమూరి అభిమానులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











