»   » సమంత పెదాలతో పవన్ కళ్యాణ్ సయ్యాట..!(ఫోటోలు)

సమంత పెదాలతో పవన్ కళ్యాణ్ సయ్యాట..!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాన్ సినిమాల్లో ఇతర విషయాల గురించి పక్కన పెడితే హీరో, హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాలు రొమాంటిక్‌గా ఉంటూనే వినోదాత్మకంగా ఉంటూ ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం అలరించే విధంగా ఉంటాయి.

గతంలో పవన్ నటించిన పలు చిత్రాల్లో ఈ పాయింట్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ హీరోయిన్ సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ ఈ ఇద్దరి మధ్య పలు ఆసక్తికరమైన సన్నివేశాలు తెరకెక్కించారు.

తాజాగా విడుదలైన ఈ చిత్రం లేటెస్ట్ స్టిల్స్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మధ్య ఈ చిత్రంలో సూపర్‌గా కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని స్పష్టం చేస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు మరిన్ని వివరాలు స్లైడ్ షోలో.....

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో జతకలిసి నిర్మిస్తున్నారు. మరో నిర్మాత భోగవల్లి బాపినీడు ‘అత్తారింటికి దారేది' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై అనూహ్య స్పందన సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ఈచిత్రం ట్రైలర్‌ను ఆన్ లైన్లో దాదాపు 10 లక్షల పైచిలకు వీక్షలు వీక్షించారు. దీన్ని బట్టి సినిమాపై ఏరేంజిలో అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఎలాంటి అభ్యంతర కర సీన్లకు తావు లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ఆయన తనదైన ప్రత్యేక శైలిని అనుసరించారు.

సినిమా విడుదలకు ముందే ‘అత్తారింటికి దారేది' చిత్రం బిజినెస్ అదిరి పోయింది. సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులు ముందస్తుగానే రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడమే ఈ పరిణామాలకు కారణం.

రేపు (19 జులై) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం అవడంతో పాటు పాసులు కూడా రెడీ అయ్యాయి. అభిమాన సంఘాలకు ఇప్పటికే పాసులు అందాయి.

ఆడియో వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఆడియో వేడుక ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ సీన్లతో పాటు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని యూనిట్ సభ్యలు అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కు స్వతహాగా అభిమాని అయిన నితిన్ ఈ చిత్రం నైజాం రైట్స్ భారీ ధరకు రూ. 13కోట్లు వెచ్చించి కొనుగోలు చేసాడని టాక్. పవన్ కళ్యాణ్ సినిమా భారీగా వసూలు చేస్తుందనే నమ్మకంతోనే నితిన్ ఇంత మొత్తం వెచ్చించినట్లు చర్చించుకుంటున్నారు.

తెర వెనక ఉండి సినిమాకు పని చేసిన వివరాల్లోకి వెళితే...సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Romantic pics of Attarintiki Daredi Released. Pawan play with Samantha lips in this pics. BVSN Prasad, the producer of Atharintiki Daredhi, has planned to hold a grand event for its music release at Shilpa Kala Vedhika in Hyderabad this Friday (July 19, 2013).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu