తన లవ్వును ప్రియమణి ఇలా బయట పెట్టింది (ఫోటోలు)
హైదరాబాద్: సౌతిండియా హీరోయిన్ ప్రియమణి ఇపుడు దుబాయ్‌లో గుడుపుతోంది. అయితే ఆమె అక్కడికి వెళ్లింది ఏ సినిమా షూటింగు కోసమో కాదు....ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గనడానికి మాత్రమే. అయితే ఇక్కడ కాస్త ఖాళీ సమయం దొరకడంతో తనకు ఇష్టమైన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.
ప్రియమణికి మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. దీంతో దుబాయ్‌లో ఓ జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లి జంతువులతో జాళీగా గడిపింది. అందుకు సంబంధించిన ఫోటోలు తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పోస్టు చేసింది. స్లైడ్ షోలో ఉన్న ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.....

మూగ జీవాలతో ప్రియమణి
దుబాయ్‌లో తన స్నేహితులకు సంబంధించిన వారి ఇంట్లో ఉన్న మూగ జీవాలతో ప్రియమణి ఇలా గడిపింది.

హార్న్‌బిల్ పక్షితో ప్రియమణి
హార్న్ బిల్ పక్షిని తన చేతిపై కూర్చోబెట్టుకుని పోటోలుక ఫోజులు ఇస్తున్న హీరోయిన్ ప్రియమణి. ఇలా మూగ జీవాలతో గడపడం అంటే ప్రియమణికి ఎంతో ఇష్టం.

రిలాక్స్...
ఇలా మూగ జీవాలతో గడపటం వల్ల మనసుకు ఎంతో హీయిగా ఉందని, చాలా రిలాక్స్ అయ్యానని ప్రియమణి చెప్పుకొచ్చింది.

ప్రియమణి థాంక్స్ చెప్పింది
ఎన్నో రకాల మూగ జీవాలను పెంచుతున్న తన ఫ్రెండ్ ఫ్యామిలీకి తనకు వాటితో గడిపే అవకాశం ఇచ్చినందుకు ప్రియమణి థాంక్స్ చెప్పింది.

ప్రియమణి సినిమాలు
సినిమాల విషయానికొస్తే ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం ‘చండీ'. అంగుళీక అనే మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు కన్నడలో అంబరీష అనే చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











