ఆ హీరోయిన్ల బికినీ ఫైట్... కేవలం పబ్లిసిటీ గిమ్మిక్కేనా?
బెంగుళూరు: సినిమా తారలు పబ్లిసిటీ కోసం ఎన్ని రకాల వేషాలు వేస్తారో కొత్తగా చెప్పాలిన పని లేదు. ఎవరైనా ఇద్దరు స్టార్స్ ప్రేమలో పడ్డా, ఎఫైర్ పెట్టుకున్నా, గొడవ పెట్టుకున్నా...... వాటి వెనక పబ్లిసిటీ గిమ్మిక్కులు దాగి ఉంటాయి. అందరూ కావాలని ఇలా చేయక పోయినా, చాలా మంది ఫ్రీ పబ్లిసిటీ కోసమే కావాలని ఇలాంటి చేస్తుంటారు. పబ్లి సిటీ కోసం ఇలా కూడా చేస్తారని అప్పుడప్పుడు ఆశ్చర్య పోవడం జనాల వంతవుతుంది. ఆ మధ్య కన్నడ సినీ తారలు రాగిణి ద్వివేది, ఐంద్రితా రాయ్ మధ్య జరిగిన 'బికిని ఫైట్' కూడా అలాంటిదే అంటున్నారంతా.
గత సంవత్సరం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరిగిన సమయంలో రాగిణి ద్వివేది, ఐంద్రితా రాయ్ మధ్య ఓచిన్న పాటి వివాదం చోటు చేసుకుంది. ఐంద్రితా రాయ్ సిసిఎల్ క్యాలెండర్ కోసం బికినీ వేసి హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. దీంతో రాగిణి ద్వివేది ఆమెపై కామెంట్స్ చేసింది. సిసిఎల్ కోసం బికినీలు వేయడం ఏమిటి? క్రికెట్ ఏమైనా బికినీ అందాలను కోరుకుంటా? అంటూ వ్యాఖ్యానించింది.
రాగిణి అంతటితో ఆగకుండా 'సిసిఎల్ ముఖ్య ఉద్దేశ్యం క్రికెట్ క్రీడకు ప్రచారం చేయడం... అంతేకానీ బికినీ వేసే గర్ల్ కోసం కాదు. నాకు కూడా సిసిఎల్ క్యాలెండర్ పై బినినీ వేయమని ఆఫర్ వచ్చింది. సిసిఎల్ లో నాకు ఎంతో మంది క్లోస్ ఫ్రెండ్ ఉన్నారు. కానీ నేను బికినీ వేయడానికి ఒప్పులేదు. ఐంద్రితా రాయ్ నాకంటే వయసులో పెద్దది. ఆమెకు ఆ మాత్రం ఆలోచన లేదా. ఆఫర్ వస్తే చేస్తారా..? దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకో అక్కర్లేదా?, కింగ్ ఫిసర్ క్యాలెండర్ కోసం అయితే ఓకే కానీ, ఇలా క్రికెట్ కోసం ఏమిటి? అంటూ రుసరుసలాడింది. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

అయితే రాగిణి వ్యాఖ్యలపై ఐంద్రితా రాయ్ తన దైన శైలిలో స్పందించింది. ఆమెకు సిసిఎల్ క్యాలెండర్లో అవకాశం రాక పోవడం వల్లనే అలా మాట్లాడుతోందని. ఆమె కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయని స్టేట్ మెంట్ ఇచ్చింది.

గత సంవత్సరం అలా పోట్లాడుకున్న ఈ ఇద్దరు ప్రైవేట్ కార్యక్రమంలో కలిసి కనిపించారు.

దీంతోగత సంవత్సరం వీరి మధ్య జరిగిన బికినీ ఫైట్ కేవలం పబ్లిసిటీ గిమ్మికే అని అందరికీ అర్థమైపోయింది.

అసలు వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలని పబ్లిసిటీ కోసమే మీడియా వారి దృష్టి తమపై పడేలా అలా చేసారని అంటున్నారు.

బెంగుళూరు జయా నగర్లోని సిల్క్ షోరూం ప్రారంభోత్సవంలో ఈ ఇద్దరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంజన చెల్లి నిఖితా, కృతి కర్బంద పాల్గొన్నారు.

షోరూం ప్రారంభోత్సవంలో నిఖిత, కృతి కర్బంద.


Click it and Unblock the Notifications











