రజనీకాంత్ కోసం తెలుగు స్టార్స్ క్యూ కట్టారు (ఫోటోస్)
హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన 'లింగా' చిత్రం షూటింగులో భాగంగా గత కొన్ని రోజులుగటా హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలోనే మకాం వేసారు. దీంతో ఆయన్ను కలిసేందుకు పలువురు తెలుగు స్టార్స్ రామెజీ ఫిల్మ్ సిటీకి క్యూ కట్టారు.
తెలుగు సినీ తారలు సంపూర్ణేష్ బాబు, బ్రహ్మాజీ, థమన్, నీరజ కోన తదితరుల రజనీకాంత్‌ను కలిసి ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సౌతిండియాలో రజనీకాంత్ రేంజి ఏమిటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక 'లింగా' చిత్రం విషయానికొస్తే ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా చేస్తున్నారు.

నటుడు బ్రహ్మాజీతో రజనీకాంత్
నటుడు బ్రహ్మాజీతో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్. లింగా షూటింగ్ జరుగుతుండగా బ్రహ్మాజీ వెళ్లి కలిసారు. కొంత సేపు ఆయనతో మాట్లాడారు.

సంగీత దర్శకుడు తమన్
తెలుగు, తమిళ చిత్రాల సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్‌తో రజనీకాంత్.

నీరజ కోన
తెలుగులో పలు చిత్రాలకు స్టైలిస్ట్‌గా, కాస్టూమ్ డిజూనర్‌గా పని చేసిన కోన నీరజ రజనీకాంత్‌తో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

సంపూర్ణేష్ బాబు
తెలుగు కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు కూడా ఇటీవల వెళ్లి రజనీకాంత్‌ను కలిసారు. రజనీకాంత్‌ను తొలిసారిగా కలిసాను, నా జన్మ ధన్యమైందని సంపూ వ్యాఖ్యానించారు.

అనుష్క శెట్టి
‘లింగా' చిత్రంలో సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జగపతి బాబు
లింగా చిత్రంలో తెలుగు నటుడు జగపతి బాబు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











