రకుల్ ప్రీతి సింగ్ : సెక్సీ బాడీ సీక్రెట్స్ ...జిమ్ ఫొటోలతో

By Srikanya

హైదరాబాద్ :వరుస అవకాశాలు, విజయాలతో జోరు మీదుంది రకుల్‌ప్రీత్‌ సింగ్. వెంకటాద్రి ఎక్సప్రెస్ తో పరిచయమైన ఆమె ఇప్పుడు మహేష్ సరసన ఆఫర్ సంపాదించే స్దాయికి చేరుకుంది. దానికి కారణం ఆమె ఫిట్ నెసే అని చెప్తుంది. ఆమె సిని పరిశ్రమకు రాకముమందే పీపుల్స్ ఛాయిస్ 2011 తో సహా అనేక అవార్డులు సంపాదించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆమె తన మాతృ భాషతో పాటు తెలుగును కూడా అంతే స్పష్టంగా మాట్లాడగలగటం ఆమె ప్రత్యేకత. పండుగ చేస్కో,కిక్ 2 సినిమాలు చేస్తున్న ఆమె బాలీవుడ్ లోనూ సిమ్లా మిర్చ్ చిత్రం చేస్తోంది.దాదాపు ప్రతీ రోజు ఆమె షూటింగ్ లో పాల్గొంటున్నా...ఆమె జిమ్ కు వెళ్లటం మాత్రం ఎప్పుడూ మానదు. అది తన జీవితంలో ఓ భాగం అని చెప్తుందామె.

జిమ్ కు వెళ్లాలన్న ఆలోచన ఆమెకు ఎప్పుడు మొదలైందీ అంటే...ఆమె తండ్రి మిలట్రీలో కల్నర్. ఆమె మాట్లాడుతూ..నేను ఓ ఫౌజీ కూతురిని. నాకు ఇంట్లో ఐడిల్ గా కూర్చోవటం ఇష్టం లేదు.నేను ఓ స్ట్రాంగ్ ఉమెన్ గానే పెరిగాను. డిల్లీ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నేను చదువు పూర్తి చేసాను. అక్కడే ఆమె ఫిటినెస్ గా ఉండాలనే విషయం తెలుసుకుని అమలులో పెట్టానంటోంది. త్వరలో 'పండగ చేస్కో', 'కిక్‌2' చిత్రాలతో సందడి చేయబోతోంది రకుల్‌.

స్లైడ్ షోలో... ఇంకా ఆమె సెక్సీ సీక్రెట్ విశేషాలు..ఫొటోలు

మా అమ్మ వల్లే..

మా అమ్మ వల్లే..

తన తల్లే తనను ఎప్పుడూ ప్రోత్సహించిదని చెప్తోంది. ఆమె అండతోనే ఈ రోజు ఇంత ఫిట్ గా ఉన్నానంటోంది.

ఇవన్నీ ఆడతా..

ఇవన్నీ ఆడతా..

తాను లాన్ టెన్నిస్, స్మిమ్మింగ్, షటిల్ బ్యాట్ మెంటెన్, బాస్కట్ బాల్ ఆడటం వచ్చను అంటోంది.

మగ పిల్లలతో సమానంగా..

మగ పిల్లలతో సమానంగా..

తన తండ్రి ప్రోత్సాహంతో తాను ఆటలన్ని ఆడేదాన్నిని, మగ పిల్లలతో సమానంగా ఆటల్లో పాల్గొనే దాన్నిని చెప్తోంది.

కరాటేలో

కరాటేలో


తాను ఒక స్పోర్ట్ పర్శన్ గా ,టామ్ బోయ్ గా ఉండేనని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె కరాటేలో బ్లూ బెల్ట్ సాధించింది.

ఇవన్నీ ఇష్టం..

ఇవన్నీ ఇష్టం..

ఆమె కు గోల్ప్ ఆడటం, గుర్రం స్వారీ చేయటం, భరతనాట్యం ఇష్టమైనవి అని చెప్తోంది.

సరైన సమయం

సరైన సమయం

ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా జిమ్ లో వర్కవుట్ లు చేయటానికి మాత్రం సరైన సమయం ఎంచుకుంటానంటోంది.

మహేష్ తో ..

మహేష్ తో ..

రకుల్ .. మరో సినిమా కమిటైంది. అది మరేదో కాదు... మహేష్ బాబు తదుపరి చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ ఖరారు చేసారు.

రకుల్ మేనేజర్ మాట్లాడుతూ...

రకుల్ మేనేజర్ మాట్లాడుతూ...

"రకుల్ ప్రీతి సింగ్ ..మహేష్ ...శ్రీకాంత్ అడ్డాల చిత్రం బ్రహ్మోత్సవం సైన్ చేసింది. ఆమె ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలు రాబోయో మూడు నెలల్లో చేయబోతోంది. తలో 15 రోజులు డేట్స్ కేటాయించింది. తర్వాత ఆమె మహేష్ ప్రాజెక్టులోకి షిప్ట్ అవుతుంది " అన్నారు.

రకుల్ మాట్లాడుతూ...

రకుల్ మాట్లాడుతూ...

''నిర్ణయాలు ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. పరిస్థితులకు తగ్గట్టు మారుతూ ఉండాలి. సినిమా రంగంలో అది అవసరం కూడా'' అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌.

అజెండాలేవి లేవు

అజెండాలేవి లేవు

''చేసే ప్రతి సినిమా నన్ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉండాలనుకొంటా. అంతకుమించి ప్రత్యేకమైన అజెండాలేవీ నేను రాసుకోలేదు'' అంటోంది.

త్వరలోనే...

త్వరలోనే...

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లాంటి స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడబోతోంది. అందుకు తగ్గ డేట్స్ కేటాయించి ఎదురుచూస్తోంది

నటనపరంగా ప్రణాళికలు

నటనపరంగా ప్రణాళికలు


''దేని గురించీ ఎక్కువగా ఆలోచించడం నాకు అలవాటు లేదు. మనసుకు నచ్చింది చేసుకొంటూ వెళుతుంటా. ఇక్కడ ఇలాంటి సినిమాలే చేయాలి, అక్కడ అలాంటివే ఒప్పుకోవాలి అన్న పట్టింపులు లేవు.

పరిమితులు లేవు..

పరిమితులు లేవు..

తెరపై కనిపించే విషయంలోనూ పరిమితులేమీ విధించుకోలేదు. కథ కోరుకొన్నట్టు నటించడంలో ఎలాంటి తప్పు లేదనేది నా అభిప్రాయం'' అని చెప్పుకొచ్చింది రకుల్‌.

పెంచేసినా..

పెంచేసినా..

ఓవర్ నైట్ లో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న రకుల్ ప్రీతి సింగ్ తన రెమ్యునేషన్ ని ఒక్కసారిగా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

పెద్దగాలేదు..

పెద్దగాలేదు..

లౌక్యం, కరెంట్ తీగ చిత్రాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆమె డిమాండ్ మాత్రం చేయటం లేదని చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు ఆమె సినిమాకు 25 లక్షలు తీసుకునేదని తెలుస్తోంది. ఇప్పుడు ఐదు పెంచి ముప్పైలో సెటిల్ అయ్యిందంటున్నారు.

రెండూ భారీవే..

రెండూ భారీవే..

వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పుడు రామ్ సరసన పండుగ చేస్కో, రవితేజ సరసన కిక్ 2 చిత్రాలు చేస్తోంది. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావటం విశేషం.

అలాగే ఈమె ఇప్పుడు సుకుమార్

అలాగే ఈమె ఇప్పుడు సుకుమార్

అలాగే ఈమె ఇప్పుడు సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం సైన్ చేసిందని తెలుస్తోంది. దాంతో ఆమెకు పెద్ద హీరోలు నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఒకటే ప్రశ్న..

ఒకటే ప్రశ్న..

''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

బాగుంటుంది..

బాగుంటుంది..

''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను. ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X