గన్‌తో దీపిక హల్‌చల్, దర్శకుడికి ముద్దులు(ఫోటోలు)
ముంబై: దీపిక పదుకొనె, రణవీర్ సింగ్ హీరో హీరోయిన్లుగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రామ్ లీలా'. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ తానై తెరకెక్కించారు భన్సాలీ. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో జరిగింది.
షేక్స్‌పియర్ నవలలోని రోమియో, జూలియెట్ పాత్రలు ఎంతో ఫేమస్. రామ్ లీలా చిత్రం అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట. దీపిక పదుకొనెతో సినిమాలో తన ఆన్ స్క్రీన్ రొమాన్స్ హై రేంజిలో ఉంటుందని, ఇదొక గొప్ప చిత్రంగా నిలుస్తుందని అంటున్నాడు ఈ చిత్ర హీరో రణవీర్ సింగ్.
నవంబర్ 15న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్లైడ్‌షోలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు చూద్దాం....

దీపిక, రణవీర్ సింగ్
రామ్ లీలా చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా దీపిక, రణవీర్ సింగ్ ఆటిట్యూడ్ ప్రవర్తన చూపరులను ఆకట్టుకుంది. సినిమాకు ప్రమోషన్ కల్పించడంలో భాగంగానే వారు మీడియాను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

దీపిక సందడి
చేతిలో గన్ పట్టుకుని దీపిక పదుకొనె రణవీర్ సింగ్‌ను బెదిరిస్తూ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందడి చేసింది. స్టేజిపై వీరి సంబాషణ, ప్రవర్తన అందరినీ తెగ నవ్వించింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఆత్మీయంగా ముద్దు
రామ్ లీలా చిత్రం హీరో హరోయిన్లయిన రణవీర్ సింగ్, దీపిక పదుకొనె కలిసి ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బుగ్గలపై చెవో వైపు ఇలా ఆత్మీయంగా ముద్దు పెట్టారు.

మీడియా కోసం...
దీపిక పదుకొనె, రణవీర్ సింగ్ కలిసి మీడియా కోసం ఫోజులు ఇచ్చారు. వారి ముఖాల్లో తొనికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం చూస్తుంటే సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

డేటింగ్ చేస్తున్నారా?
రామ్ లీలా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దీపిక పదుకొనె, రణవీర్ సింగ్ ప్రవర్తన చూసిన కొందరు వీరి మధ్య రియల్ లైఫ్ లో కూడా ప్రేమాయణం నడుస్తుందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీపిక, రణవీర్, భన్సాలీ
దీపిక పదుకొనె, రణవీర్ సింగ్, సంజయ్ లీలా భన్సాలీ కలిసి ‘రామ్ లీలా' ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా మీడియాకు ఇలా ఫోజులు ఇచ్చారు.

బ్యూటిఫుల్ దీపిక
రామ్ లీలా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దీపిక ఎంతో బ్యూటి ఫుల్‌గా దర్శనం ఇచ్చింది. ఆమెను చూసిన వారంతా ఎంతో అందంగా ఉందంటూ పొగర్తలతో ముంచెత్తారు.

రణవీర్ సింగ్
రణవీర్ సింగ్ కూడా ‘రామ్ లీలా' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి స్మార్ట్ లుక్ తో హాజరయ్యాడు. ఈచిత్రం కోసం రణవీర్ చాలా కష్టపడి పని చేసాడు. సినిమాకు తగిన విధంగా తన బాడీ షేపులను మార్చుకున్నాడు.

బర్ఖా బిస్త్
హిందీ టెలివిజన్ నటి బర్ఖా బిస్త్ కూడా ‘రామ్ లీలా' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకు సంబందించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సంజయ్ తల్లికే ఈ సినిమా అంకితం
‘రామ్ లీలా' చిత్రాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. తల్లి, సోదరితో భన్సాల్ ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.


Click it and Unblock the Notifications











