కరణ్ జోహార్ ఇంట్లో పార్టీ... అర్థరాత్రి కెమెరాకు చిక్కిన సెలబ్రిటీలు!

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు కొంతకాలంగా బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఇద్దరూ చాటు మాటుగా తమ వ్యవహారాన్ని నడిపిస్తూనే పైకి మాత్రం అబ్బే...అదేం లేదు, మా మధ్య ఎఫైర్ లేదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా కంట పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా ఇద్దరూ మరోసారి కలిసి మీడియా కంట పడ్డారు. అయితే ఈ సారి చాటు మాటుగా కాదులెండి. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయడంతో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్‌తో పాటు కరీనా కపూర్, సిద్ధార్థ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరయ్యారు. అర్ధరాత్రి దాటే వరకు ఈ పార్టీ జరిగింది.

ఈ పార్టీ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమంగా జరిగింది. వీకెండ్ కావడంతో అంతా సరదాగా ఎంజాయ్ చేయడానికే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మీడియాకు అనుమతి ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీలు కరణ్ జోహార్ ఇంటికి చేరుకున్న కొన్ని దృశ్యాలు మాత్రం మీడియాకు చిక్కాయి.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


పార్టీ అనంతరం కరణ్ జోహార్ ఇంటికి నుంచి బయటకు వస్తున్న కత్రినా కైఫ్. పొట్టి గౌనులో కత్రినా కైఫ్ ఎంతో హాట్‌గా దర్శనమిచ్చింది.

కరీనా కపూర్

కరీనా కపూర్


కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన ఈ పార్టీకి బాలీవుడ్ హాట్ బేబ్ కరీనా కపూర్ కూడా హాజరయ్యారు. సిద్ధార్థ మల్హోత్రా, అయాన్ ముఖర్జీలతో కరీనా కలిసి ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కరీనా-కత్రినా

కరీనా-కత్రినా


పార్టీ ముగిసిన అనంతరం ఒకరికొకరు గుడ్ బై చెప్పుకుంటున్న కరీనా కపూర్, కత్రినా కైఫ్.

కత్రినా నవ్వుకు కారణమేంటో?

కత్రినా నవ్వుకు కారణమేంటో?


పార్టీ అనంతరం బయటకు వస్తూ....కత్రినా ఇలా ముసిముసి నవ్వులు నవ్వింది. మరి ఆమె నవ్వుకు కారణమేంటో?

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్


కత్రినా వెళ్లి పోయిన కాసేపటి తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కరణ్ జోహార్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

క్లోజప్

క్లోజప్


ఇక్కడ మీరు చూస్తున్నది రణబీర్ కపూర్ క్లోజప్ షాట్. ఇలా ఎప్పుడూ చార్మింగ్‌గా కనిపించబట్టే అమ్మాయిలంతా ఈ యంగ్ హీరో అంటే పడిచస్తున్నారు.

ఇతరులు

ఇతరులు


కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలైన సిద్ధార్థ మల్హోత్రా, ఆదిత్యరాయ్ కపూర్ తదితరులు కూడా హాజరయ్యారు.

కరణ్ ఎక్కడ?

కరణ్ ఎక్కడ?


ఆశ్చర్య కరంగా...పార్టీ ఇచ్చిన దర్శకుడు కరణ్ జోహార్ మాత్రం కెమెరాకు చిక్కలేదు. తన ఇంటికి వచ్చిన గెస్ట్ లకు వీడ్కోలు ఇవ్వడానికి కూడా ఆయన బయటకు రాలేదు. మరి ఆయన ఏ స్థితిలో ఉన్నారో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X