‘గాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్’తో షకీల (ఫోటోలు)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రంతోని అంత్యాక్షరి సీన్ ద్వారా పాపులర్ అయిన రౌడీ గ్యాంగ్ ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా ప్లాన్ చారు. 'గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్' పేరుతో ఈ సినిమా రాబోతోంది. తార నీలు కార్పోరేషన్ పతాకంపై యం.యస్.బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది.
ఈ చిత్రంలో శృంగార తార షకీల కూడా నటిస్తోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత యం.యస్.బాబు మాట్లాడుతూ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో షకీల ఫైనాన్స్ పెంటమ్మ అనే పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది అన్నారు.
సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

షకీల
షకీల మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర సీరియస్‌గా ఉన్నప్పటికీ హాస్యం పండిస్తుంది. నేను పోషిస్తున్న ఫైనాన్స్ పెంటమ్మ పాత్ర మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

సినిమా కాన్సెప్టు ఏమిటి?
సమాజంలో రౌడీలుగా చలామణి అవుతున్న వ్యక్తులకు బాధ్యత గల చట్టాన్ని వారికి అప్పగిస్తే వారు పడే అగచాట్లు ఎలా ఉంటాయి అనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

గబ్బర్ సింగ్ గ్యాంగ్
గబ్బర్ సింగ్ అంత్యాక్షరి గ్యాంగ్ లోని బంటి, రమేష్, ఆంజనేయులు, రామ్సన్, సాయి బాబు, ప్రవీణ్, అలీ, గౌతం రాజు, చిట్టి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తార నీలు ప్రొడక్షన్
తార నీలు కార్పోరేషన్ పతాకంపై యం.యస్.బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

కామెడీ ప్రధానంగా
కామోడీ ప్రదానంగా ఈ చిత్రాం తెరకెక్కుతోంది. షకీల ఉండటం వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ వస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











