మైదానంలో హాట్ లుక్‌తో.. కమల్ హాసన్ కూతుర్లు(ఫోటోలు)
హైదరాబాద్: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముద్దుల కూతుర్లు శృతి హాసన్, అక్షర హాసన్‌లు ఇటీవల హైదరాబాద్ లోని లాల్ బహదూర్ మైదానంలో హాట్ లుక్ తో సందడి చేసారు. చెన్నై రైనోస్ టీంకు సపోర్టు చేస్తున్న శృతి హాసన్, అక్షర హాసన్‌లకు ఆ రోజు వర్షం కారణంగా నిరాశే ఎదురైంది. వరుణుడు అడ్డు పడటంతో మ్యాచ్ సాగలేదు.
అయితే ఈ ఇద్దరు కలిసి ఇలా సందడి చేయడం ఇదే మొదటి సారి కావడంతో అందరి దృష్టి వారిపైనే. ఇక మీడియా వారు, ఫోటో గ్రాఫర్ల హడావుడి అంతా ఇంతా కాదు. మొత్తానికి ఈ ఈవెంట్ కు ఇద్దరు అక్కాచెల్లెళ్లు హాట్ అండ్ సెక్సీ లుక్ తో సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా మారారు.
ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ... మేమిద్దరం తొలిసారిగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చూడటానికి వచ్చాం. వర్షం కారణంగా చాలా డిస్సప్పాయింట్ అయ్యాం. కానీ స్టేడియంలో తిరుగుతూ, అభిమానులను చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం అని చెప్పుకొచ్చింది. మిగతా వివరాలు స్లైడ్ షోలో....

సినిమా స్టార్స్ క్రికెట్ ఆడుతుంటే చూడటం చాలా బాగుంటుందని, అభిమానుల కరతాల ధ్వనులతో మిరిమిట్లు గొలిపే వాతావరణం ఉంటుంటుందని శృతి అభిప్రాయ పడింది.

శృతి హాసన్ చెన్నైరైనోస్ టీంకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ఆమె క్రికెట్ కు వీరాభిమాని కాక పోయినా.... ఆమె సోదరి అక్షర మాత్రం క్రీడాప్రేమికురాలు.

శృతి చెప్పిన వివరాల ప్రకారం... ఆమె గత రెండు సంవత్సరాల నుంచి మాత్రమే క్రికెట్ క్రీడను ఫాలో అవుతోంది.

ప్రస్తుతం శృతి పలు సినిమాల షూటింగులతో బిజీగా ఉండటం వల్ల చెన్నై రైనోస్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్ లు చూడలేక పోతోందట.

శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే... ఆమె ప్రస్తుతం తెలుగు సినిమాలైన ఎవడు, బలుపు, ఇతర హిందీలో డి డే, రామయ్య వస్తా వయ్యా అనే చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ సినిమాలో అతిథి పాత్ర చేస్తోంది.


Click it and Unblock the Notifications











