ఫొటోలు: శ్రీకాళహిస్తిలో సిద్ధార్థ, సమంత
శ్రీకాళహస్తి: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ సమంత శనివారం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. సమంత తన కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి సందర్శించి రాహుకేతువు పూజ నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరుడికి ప్రార్థనలు చేసి, పూజారుల ఆశీస్లు తీసుకున్నారు.
సిద్ధార్థ తండ్రి సూర్యనారాయణ పూజ చేస్తుండగా రెండు మార్లు స్పృహ తప్పి పడిపోయారు. ఉపవాస దీక్షలో ఉండడంతో ఆయన అలా స్పృహ తప్పారు. ఆయన వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. దర్శకుడు క్రిష్ కూడా కాళహస్తీశ్వరుడిని సందర్శంచి పూజలు చేశారు.
సమంత తెలుగు సినిమాల్లో ఇటీవలి కాలంలో అదరగొడుతోంది. మహేష్ బాబు, సమంత జంట తెలుగులో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది.

శ్రీకాళహస్తిలో పూజలు చేస్తూ సమంత, సిద్ధార్థ్, తదితరులు

శ్రీకాళహస్తిలో పూజలు చేస్తూ సమంత, సిద్ధార్థ్, మధ్యలో మరో వ్యక్తి...

శ్రీకాళహస్తిలో సమంత, సిద్ధార్థ్ ఇలా


Click it and Unblock the Notifications











