ఫోటోలు : యశో సాగర్ అంత్యక్రియలకు హాజరైన స్నేహాఉల్లాల్
బెంగుళూరు : ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో యశోసాగర్ డిసెంబర్ 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అతను ఉన్నట్టుండి మరణించడం ఎంతో మంది టాలీవుడ్ స్టార్స్ ను షాక్‌కు గురి చేసింది. ముఖ్యంగా యశో సాగర్ తో పాటు 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌ని అతని మరణం మరింత ఎక్కువ షాక్‌కు గురి చేసింది. బెంగుళూరులో జరిగిన యశో సాగర్ దహన క్రియలకు కూడా ఆమె హాజరయ్యారు.
ప్రస్తుతం ముంబైలో ఉన్న స్నేహా ఉల్లాల్....యశో సాగర్ మరణ వార్త విన్న వెంటనే బెంగుళూరు బయల్దేరి వెళ్లింది. తన ట్విట్టర్ ద్వారా యశో సాగర్ మృతికి సంతాపం ప్రకటించింది. యశో సాగర్ తనకు మంచి ఫ్రెండ్ అని, తాము ఒకేసారి ఒకే సినిమాతో పరిశ్రమలోకి అడుగు పెట్టామని, అతను భౌతికంగా లేడనే విషయం ఎంతో బాధిస్తుందని స్నేహా ఉల్లాల్ చెప్పుకొచ్చింది.
'ఇటీవల ఆయన నా బర్త్ డే పార్టీకి వచ్చాడు. ఆ రోజు రాత్రంతా మేము మాట్లాడుకున్నాం. అతనితో ఉన్న స్నేహ బంధం మరువలేనిది. యశో సాగర్ ఫ్యామిలీ నా కోసం, నేను అతన్ని చివరి సారిగా చూడటం కోసం వెయిట్ చేసారు. నేను ఈ సంఘటన ఎప్పటికీ మరువలేను' అంటూ స్నేహా ఉల్లాల్ ట్వీట్ చేసింది.
యశో సాగర్, స్నేహా ఉల్లాల్... కలిసి నటించిన అరుదైన ఫోటోలు స్లైడ్ షో ద్వారా మీకోసం....

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో

స్నేహా ఉల్లాల్, యసో సాగర్ ఫోటో


Click it and Unblock the Notifications











