ఐపీఎల్ మ్యాచ్‌లో సుశాంత్-బాబా సెహగల్ షో...(ఫోటోలు)
హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సుశాంత్ తాజా చిత్రం 'అడ్డా' ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై హీరో సుశాంత్, ఐటం గర్ల్ శ్వేతా భరద్వాజ్, సింగర్ బాబా సెహగల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాటలు పాడుతూ సందడి చేసారు.
ఈ సందర్భంగా యాక్టర్ సుశాంత్ వన్ ఇండియా ప్రతినిధితో మాట్లాడుతూ...'ఐపీఎల్ వేదికపై ఇంత మంది క్రికెట్ అభిమానుల మధ్య పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది, అడ్డా సినిమా మంచి వినోదాత్మక చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది' అని తెలిపారు.
అడ్డా చిత్రంలో బాలీవుడ్ ఐటం గర్ల్ శ్వేతా భరద్వాజ్ స్పెషల్ సాంగ్‌లో హాట్ సెక్సీగా పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. గతంలో సుశాంత్ కాళిదాసు సినిమాలో 'చోరీ చోరి' సాంగు పాడిన సింగర్ బాబా సెహగల్ 'అడ్డా'చిత్రంలో రెండో సారి సుశాంత్ కోసం పాడబోతున్నారు.

సుశాంత్, శాన్వి జంటగా శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో ‘అడ్డా' చిత్రం రూపొందుతోంది.

చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తాగుబోతు రమేష్, నల్ల వేణు, ధన్‌రాజ్, స్వప్నిక తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఎస్.అరుణ్‌కుమార్, ఎడిటింగ్: శ్రీనివాస్, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్.

అడ్డా చిత్రంలో సుశాంత్, శాన్వి.


Click it and Unblock the Notifications











