బాయ్‌ఫ్రెండ్‌ వచ్చాక మరింత హ్యాపీగా సుష్మితా సేన్ (బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోస్)

బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తరచూ ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ అవుతుంటారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. పెళ్లికి దూరంగా ఉంటున్న ఈ 43 ఏళ్ల హాట్ లేడీ... కొన్నేళ్ల క్రితమే ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.

మరి సుష్మిత జీవితంలో మగతోడు లేదా? అంటే నో అనడానికి వీలు లేదు. ఇప్పటికే చాలా మందితో ఆమె లవ్ ఎపైర్, డేటింగ్స్, లివ్ ఇన్ రిలేషన్స్ షిప్స్‌లో మునిగితేలారు అనేది బహిరంగ రహస్యమే. ఇటీవలే ఆమె జీవితంలోకి 11 బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. పేరు రొహమన్ షావల్. మోడలింగ్ రంగానికి చెందిన వ్యక్తి.

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సుష్మిత బర్త్ డే సెలబ్రేషన్స్

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సుష్మిత బర్త్ డే సెలబ్రేషన్స్

సుష్మిత 43వ బర్త్ డేను రొహమన్ షావల్ ఇటీవల దుబాయ్‌లో ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేశాడు. అతడి కంపెనీ దొరికిన తర్వాత సుష్మిత చాలా ఆనందంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

 కొన్ని సరదాలు తీరాలంటే బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే

కొన్ని సరదాలు తీరాలంటే బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే

ఎక్కడ ఎవరితో? ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో తెలియదు కానీ... తనకు పెళ్లి అవసరం లేదు, తన జీవితంలో మగతోడ అవసరం లేదు అని కొన్నేళ్ల పాటు భీష్మించుకుని కూర్చున్న సుష్మిత తర్వాత మనసు మార్చుకున్నారు. పెళ్లికి దూరంగా ఉంటున్నా బాయ్ ఫ్రెండ్స్ రూపంలో మగతోడు వెతుక్కుంటున్నారు. జీవితంలో కొన్ని సరదాలు తీరాలంటే బాయ్ ఫ్రెండ్స్ ఉండాల్సిందే.

ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు

ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు

రొహమన్ షావల్ సుష్మితా సేన్‌ను ప్రేమించడం మాత్రమే కాదు... ఆమె కూతుళ్లకు కూడా ఎంతో క్లోజ్ అయ్యాడు. తండ్రిలాగా వారి బాధ్యతలు చూసుకుంటున్నాడు. సుష్మిత కుటుంబంలో అతడూ ఒక భాగమైపోయాడు.

తల్లి, సోదరుడితో కలిసి

తల్లి, సోదరుడితో కలిసి

సుష్మితా సేన్ బర్త్ వేడుకల్లో ఆమె తల్లి సుబ్రాతో పాటు సోదరుడు రాజీవ్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. మామ్ అండ్ హర్ కిడ్స్ అంటూ ఫోటో షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X