రజనీకాంత్‌కు హీరో రాజా పెళ్లి ఇన్విటేషన్ (ఫోటోలు)
హైదరాబాద్: ఆనంద్, వెన్నెల లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాజా. రాజా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలో చెన్నైకి చెందిన అమృత అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. మార్చి 3వ తేదీన వీరి నిశ్చితార్థం చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది.
అమృత తండ్రి ఫెడ్రిక్ విన్సెంట్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య అమృత, ఆమె తల్లిదండ్రులతో కలిసి రజనీకాంత్‌ను పెళ్లికి ఆహ్వానించేందుకు వెళ్లాడు రాజా. అందుకు సంబంధించిన ఫోటోలు, వివాహానికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

రజనీకాంత్‌కు రాజా వెడ్డింగ్ ఇన్విటేషన్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానిస్తున్న తెలుగు నటుడు రాజా. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

రజనీకాంత్‌తో రాజా-అమృత
తనను పెళ్లికి ఆహ్వానించేందుకు వచ్చిన రాజాను రజనీకాంత్ ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. కాబోయే భార్య భర్తలు ఇద్దరూ రజనీకాంత్‌తో ఇలా ఫోటో దిగారు.

రజనీకాంత్ ఆశీస్సులు
రజనీకాంత్‌కు ఇన్విటేషన్ ఇవ్వడానికి రాజా-అమృత స్వయంగా రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇలా రాజా రజనీకాంత్ ఆశ్వీర్వాదం తీసుకున్నారు.

రాజా ఫ్యామిలీతో రజనీకాంత్
రాజా, రాజా తండ్రి చంద్రమౌళి, ఫెడ్రిక్ విన్సెంట్, అమృతతో కలిసి చెన్నైలోని తన నివాసంలో రజనీకాంత్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రాజాతో రజనీకాంత్
రాజాతో కలిసి రజనీకాంత్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రాజా ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్
రాజా-అమృత ఎంగేజ్మెంట్ ఇటీవల చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది. వీరి వివాహం ఏప్రిల్ 25వ తేదీన చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరుగనుంది.


Click it and Unblock the Notifications











