మహేష్, బన్నీ, సామ్-చైతూ ఇంకా స్టార్స్... (న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫోటోస్)
2017 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రకు బాగా కలిసొచ్చింది. గడిచిన ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుండి 1700 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిన 'బాహుబలి-ది కంక్లూజన్' లాంటి సినిమాతో పాటు అనే హిట్ చిత్రాలు వచ్చాయి. 2017కు వీడ్కోలు చెబుతూ 2018కి గ్రాండ్‌గా వెల్ కం చెబుతూ సినిమా స్టార్లు అంతా వేడుకల్లో మునిగి తేలారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత, నాగ చైతన్య తదితరులు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

సమంత, చైతు
ఇటీవలే వివాహం చేసుకున్న నాగ చైతన్య, సమంత.... పెళ్లి తర్వాత ఎంజాయ్ చేస్తున్న తొలి ఈవెంట్ ఇదే. ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు

చై-సామ్‌తో పాటు సుశాంత్ కూడా
చైతన్య, సమంతతో పాటు.... అక్కినేని ఫ్యామిలీ స్టార్లు సుశాంత్, అఖిల్ తదితరులు కూడా నూతన సంవత్సర వేడుకల్లో కలిసే ఎంజాయ్ చేశారు.

మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ
మహేష్ బాబు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అల్లు అర్జున్
నూతన సంవత్సర వేడుకల్లో తన స్నేహితులతో కలిసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

భార్య స్నేహారెడ్డితో బన్నీ
తన భార్య స్నేహా రెడ్డి అండ్ గ్యాంగ్ తో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో అల్లు అర్జున్.

లుక్ అదిరింది
న్యూ ఇయర్‌కు వెల్ కం చెబుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు సముద్రం ఒడ్డున ఇలా....

హీరోయిన్ చార్మి
నూతన సంవత్సర వేడుకల్లో తన స్నేహితులతో కలిసి నటి చార్మి.

అనుష్క-కోహ్లి
ఇటీవలే పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లి నూతన సంవత్సర వేడుకలను సౌతాఫ్రికాలో సెలబ్రేట్ చేసుకున్నారు.

మనవరాలితో అమితాబ్
తన మనవరాలు ఆరాధ్యతో కలిసి నూతన సంవత్సర ఆరంభాన్నిసెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్.

భార్యతో కలిసి సైఫ్
తన భార్య కరినా కపూర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.

సన్నీ లియోన్
నూతన సంవత్సర వేడుకల్లో తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ నటి సన్నీ లియోన్.

తాప్సి
నూతన సంవత్సర వేడుకల్లో తన సోదరితో కలిసి హీరోయిన్ తాప్సి.


Click it and Unblock the Notifications











