For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాలీవుడ్ స్టార్స్ పెంపుడు కుక్కలు (ఫోటో ఫీచర్)

By Bojja Kumar
|

హైదరాబాద్: మనిషికి కుక్క అత్యుత్తమ నేస్తం అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మానవ చరిత్రను పరిశీలిస్తే మనిషికి తోడుగా ఉండి, పనిచేసిన జంతునేస్తం కుక్కే. పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరూ చేసే పనే. వాటిమీద విపరీతమైన ప్రేమ కురిపిస్తారు కొంతమంది. కొందరైతే పెంపుడు జంతువులే తమ ప్రాణంగా భావిస్తారు. అలాంటి వాటిలో కుక్కపిల్లలు ముందుంటున్నాయి. కుక్కపిల్లలు ఇంట్లో ఉంటే, ఇంట్లో మరో వ్యక్తి ఉన్నంత భావన కలుగుతుంది.

ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే పలువురు తెలుగు సినిమా స్టార్లు కూడా తమ పెంపుడు కుక్కలకు వీరాభిమానులే. కొందరైతే అవి లేకుండా ఉండలేరు. వాటితో బలమైన బంధం ఏర్పరుచుకున్నారు. అలాంటి సినీతారల వివరాలను స్లైడ్ షోలో.....

నాగార్జున పెట్ డాగ్

నటి అమలకు మాత్రమే కాదు...నాగార్జునకు కూడా కుక్కలంటే ప్రాణం. కుక్కలను రక్షించేందుకు అమల స్థాపించిన బ్లూక్రాస్ సంస్థ వెనక ఆయన హస్తం కూడా ఉంది.

రామ్ చరణ్ పెట్ డాగ్

రామ్ చరణ్ వద్ద బ్లాక్ లాబ్రడార్ జాతి కుక్క ఉంది. దాని పేరు బ్రాట్. అయితే కొన్ని సంవత్సరాల క్రితం చరణ్ దాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన భార్య ఉపసన చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2013న ఓ కుక్కను గిఫ్టుగా ఇచ్చింది. ఆ కుక్క కోసం చరణ్ వెజిటేరియన్‌గా మారాడు.

అనుష్క పెట్ డాగ్

నటి అనుష్కకు కేవలం కుక్కలంటే ప్రేమ మాత్రమే కాదు...వాటి రక్షణ కోసం స్వచ్ఛందంగా పని చేస్తోంది. బ్లూక్రాస్ సంస్థ నిర్వహించిన పలు పెట్ కార్నివాల్స్‌లో అనుష్క పాల్గొంది.

అమలా పాల్ పెట్ డాగ్

నటి అమలా పాల్‌కు కూడా కుక్కలంటే మహా ఇష్టం. తన ఖాళీ సమయంలో ఎక్కవ శాతం తన కక్కతోనే గడుపుతుంది. ఈ ఫోటోనే అందుకు నిదర్శనం.

కాజల్ అగర్వాల్ పెట్ డాగ్

కాజల్ అగర్వాల్‌కు కూడా ఓ పెట్ డాగ్ ఉంది. దాని పేరు సీజర్. అదంటే ఆమెకు చాలా ఇష్టం. ఖాళీ దొరికితే దాంతోనే గడుపుతుంది.

అక్కినేని అమల పెట్ డాగ్

కుక్కల సంరక్షణ కోసం అమలా అక్కినేని బ్లూక్రాస్ సంస్థను స్థాపించింది. వీధి కుక్కలను పాశవికంగా చంపకుండా వాటికి టీకాలు వేయడం లాంటివి చేయాలని పోరాడుతోంది.

త్రిష పెట్ డాగ్

పెటా సంస్థలో త్రిష యాక్టివ్ మెంబర్ గా ఉంది. ఆమె వద్ద పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి. అన్ని కుక్కలను తన సొంత కుక్కల్లా ట్రీట్ చేస్తుంది.

ప్రియమణి పెట్ డాగ్

ప్రియమణికి కుక్కలంటే చాలా ఇష్టం. ఆమె వద్ద మోచా అనే డాగ్ కూడా ఉంది. వీటితో పాటు పిల్లులన్నా ఆమెకు చాలా ఇష్టం.

మంచు మనోజ్ పెట్ డాగ్

మంచు మనోజ్ వద్ద కూడా జీయస్ అనే పెట్ డాగ్ ఉంది. దుర్గం చెరువు వద్ద మనోజ్ ఇలా దర్శనమిచ్చారు.

సిద్దార్థ పెట్ డాగ్

సిద్ధార్ధ వద్ద మోగ్లి అనే కుక్క ఉంది. దాన్ని అతను తన సొంత కొడుకులా చూసుకుంటారు. ఈ విషయాన్ని సిద్ధార్థ స్వయంగా వెల్లడించారు.

అసిన్

అసిన్ కూడా గ్రేట్ డాగ్ లవర్. ఓ సారి ప్రమాదంలో ఉన్న కుక్కను కాపాడి ఆసుపత్రికి చేర్చింది.

జెనీలియా

జెనీలియాకు కూడా కుక్కలంటే ఎంతో ఇష్టం. జెనీలియా వద్ద పెప్పర్ అనే కుక్క ఉంది.

ఇలియానా పెట్ డాగ్

ఇలియానా వద్ద కూడా ఓ పెట్ డాగ్ ఉంది. తన ఖాళీ సమయాన్ని దాంతోనే గడుపుతుంది ఇలియానా.

మంచు లక్ష్మి పెట్ డాగ్

మంచు లక్ష్మి వద్ద కూడా దాని పేరు జీయస్ ఆనంద్ మంచు. చందమామ కథలు చిత్రంలో మంచు లక్ష్మితో పాటు ఈ కుక్కకూడా నటించింది.

సదా పెట్ డాగ్

నటి సదాకు కూడా కుక్కలు అంటే ఎంతో ఇష్టం. పెటా తరుపున కుక్కల సంరక్షణ కార్యక్రమంలో పాల్గొంది.

శ్రీయ

శ్రీయకు కూడా కుక్కలు అంటే మహా ఇష్టం. బీచ్ ఒడ్డున ఆమె ఇలా తన కుక్కతో ఎంజాయ్ చేస్తుంది.

తాప్సీ

హీరోయిన్ తాప్సీకి కూడా కుక్కలు అంటే ఇష్టం. ఆమె వద్ద ఓ కుక్క కూడా ఉంది. దాంతో కలిసి ఓ తమిళ సినిమాలో కూడా నటించింది.

ఉదయ్ కిరణ్

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఉదయ్ కిరణ్ వద్ద ఓ కుక్క ఉండేది. అతనికి కుక్కలంటే ప్రాణం.

స్నేహా ఉల్లాల్

నటి స్నేహా ఉల్లాల్ కూడా డాగ్ లవరే. ఆమె తన ఖాళీ సమయాన్ని వాటితోనే గడుపుతుంది.

English summary
The dog is the first domesticated animal and has been the most widely kept as pet animal in human history. Raising a pet dog has become a common scene in many households. We have a few actors and actresses in Telugu film industry, who have pet dogs. They treat them as a family member and love them more than their lives. They spend their free time with them. We bring you photos of Tollywood stars with their favourite dogs.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more