»   » ఫోటోలు : వెంకీ, సల్మాన్ సినిమా ప్లాన్ చేస్తున్నారా?

ఫోటోలు : వెంకీ, సల్మాన్ సినిమా ప్లాన్ చేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు హీరో వెంకటేష్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది ఫిల్మ్ నగర్లో. ప్రస్తుతం వెంకటేష్ తెలుగులో 'గోల్ మాల్' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సల్మాన్ కూడా తన తాజా సినిమా 'మెంటల్' షూటింగులో భాగంగా ఇక్కడే ఉన్నారు.

ఈ నేపథ్యంలో సమయం దొరికినప్పుడల్లా కలుస్తున్నట్లు, ఏవో సినిమా విషయాలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా మంచి స్నేహ బంధం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్. వెంకటేష్ కూడా ఈ మధ్య మల్టీ స్టారర్ చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.

అయితే సల్మాన్-వెంకటేష్ కలిసి పని చేయబోతున్నారనేదానిపై ఖశ్చితమైన సమాచారం మాత్రం లేదు. భవిష్యత్‌లో బహుషా వీరిద్దరు కలిసి నటించే అవకావం ఉండొచ్చొని వెంకీ సన్నిహితులు అంటున్నారు. చూద్దాం మరి వీరి కలయికలో సినిమా ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో...?

ఓ ప్రముఖ ఆంగ్లపత్రికతో వెంకీ సన్నిహితులు మాట్లాడుతూ...ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, ఇప్పటికే పలు స్క్రిప్టులు పరిశీలించారని, భవిష్యత్ లో వీరి కలయికలో హిందీ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు' ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వెంకటేష్, సల్మాన్ తమ తమ సినిమా షూటింగుల్లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

సల్మాన్-వెంకటేష్ చాలా కాలంగా మంచి స్నేహితులు. ఈ విషయాన్ని వారు సైతం పలు సందర్బాల్లో వెల్లడించారు.

సల్మాన్‌తో కలిసి సినిమా చేసే ప్లాన్స్ ఉన్నాయని, అయితే ఇవి ఇంకా ప్రతి పాదనల దశలోనే ఉందని, ఇంకా ఏ విషయమూ ఖరారు కాలేదని వెంకటేష్ గతంలో తెలిపారు.

సౌతిండియాలో సల్మాన్‌కు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో వెంకటేష్ ఒకరు. చాలా సందర్బాల్లో వారు సన్నిహితంగా మెలిగారు. ముఖ్యంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో...

ప్రస్తుతం వెంకటేష్ తెలుగులో ‘గోల్ మాల్' చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ ‘మెంటల్' అనే హిందీ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా సల్మాన్-వెంకీ ఆత్మీయ ఆలింగనం

మైదానంలో సందడి చేస్తూ సరదాగా సల్మాన్, వెంకటేష్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఆసక్తిగా తిలకిస్తున్న సల్మాన్, వెంకటేష్

సల్మాన్, వెంకటేష్ లతో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా రామ్ చరణ్

సిసిఎల్ వేదికపై ఇతర పరిశ్రమల హీరోలతోకలిసి వెంకీ, సల్మాన్

సోనాక్షి, వెంకటేష్, సల్మాన్, శరత్ కుమార్ లుక్ అదిరింది కదూ...

సిసిఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీకాంత్, వెంకటేష్, సల్మాన్ ఖాన్

English summary
Telugu actor Venkatesh Daggubati, who was recently seen bonding with Salman Khan here, reportedly wants to work with the Bollywood star in a Hindi film soon. While Venkatesh has been shooting for Telugu remake of Bol Bachchan in the city, where Salman is also busy filming for Mental.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu