కొరటాల శివ మూవీ, మహేష్ బాబు వైఫ్ స్పెషల్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న సినిమా సోమవారం రామనాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం అయింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు. మహేష్ బాబు సరసన శృతిహాసన్ కథానాయికగా నటించనుంది.

ఆగడు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు రాలేక పోయారు. అయితే ఆయన లేని లోటేను భర్తీ చేసేందుకు మహేష్ భర్య నమ్రత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఆమెతో పాటు మహేష్ బాబు బావ స్వరూప్ కూడా హాజరయ్యారు.

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మొదట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

నమ్రత స్పెషల్

నమ్రత స్పెషల్


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో పొలిటీషియన్స్ దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు,రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నాగం జనార్ధన్ రెడ్డి, అచ్చయ్య నాయుడు, జెమిని కిరణ్, బెల్లంకొండ సురేష్, దిల్ రాజు, అనిల్ సుంకర, గోపీ అచంట, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొని చిత్రం యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.

శ్యాంప్రసాద్ రెడ్డి

శ్యాంప్రసాద్ రెడ్డి


ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడుతున్న శ్యాంప్రసాద్ రెడ్డి

కెమెరా స్విచాన్ చేస్తున్న వినాయక్

కెమెరా స్విచాన్ చేస్తున్న వినాయక్


కెమెరా స్విచాన్ చేస్తున్న ప్రముఖ దర్శకుడు వివి వినాయక్.

స్క్రిప్టు

స్క్రిప్టు


సినిమా స్క్రిప్టును వివి వినాయక్, శ్యాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అందుకుంటున్న కొరటాల శివ.

రాఘవేంద్రరావు, వివి వినాయక్

రాఘవేంద్రరావు, వివి వినాయక్


సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వివి వినాయక్, రాఘవేంద్రరావు ఇలా...

దిల్ రాజు-కొరటాల శివ

దిల్ రాజు-కొరటాల శివ


సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దిల్ రాజు, కొరటాల శివ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

మహేష్ బాబు బావతో...

మహేష్ బాబు బావతో...


మహేష్ బాబు బావ స్వరూప్ తో దర్శకుడు కొరటాల శివ ఇలా సందడి చేసారు.

గోపి, సురేష్, సాయి

గోపి, సురేష్, సాయి


మహేష్ బాబు మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాతలు గోపీచంద్ ఆచంట, బెల్లంకొండ సురేష్, సాయి కొర్రపాటి.

దిల్ రాజు-అనిల్

దిల్ రాజు-అనిల్


మహేష్-కొరటాల మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర ఇలా...

సురేష్-అనిల్

సురేష్-అనిల్


మహేష్ బాబు మూవీ ఓపెనింగ్ సందర్భంగా బెల్లంకొండ సురేష్, అనిల్ సుంకర

రాఘవేంద్రరావుతో స్వరూప్

రాఘవేంద్రరావుతో స్వరూప్


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి మహేష్ బాబు బావ స్వరూప్ ఇలా...

డివివి దానయ్య

డివివి దానయ్య


మహేష్ బాబు మూవీ ఓపెనింగ్ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య కూడా హాజరయ్యారు.

నటీనటులు

నటీనటులు


మహేష్ బాబు, శృతిహాసన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, సంపత్, సుబ్బరాజు, తులసి తదితరులు ఈ చిత్రంలో ముఖ్య తారాగణం.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ - మది, ఆర్ట్ - ఎ.యస్.ప్రకాష్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు - అశోక్ కుమార్ రాజు.యం, చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు - ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X