హీరో, దర్శకుడితో సెక్స్ : హీరోయిన్ స్పందన ఇలా..
ఈ నేపథ్యంలో 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' చిత్రం హీరోయిన్ పియా భాజ్ పాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై అడిగిన ప్రశ్నకు తనదైన రీతిలో స్పందించారు. 'కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిపోదామని అలా చేసే వాళ్లు ఉండొచ్చేమో కానీ, టాలెంటును నమ్ముకున్న వాళ్లు ఎప్పటికీ అలా చేయరు. అలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయకపోవడమే మంచిదని నా ఉద్దేశ్యం' అని చెప్పుకొచ్చారు.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్ర హీరో మహత్ రాఘవేంద్రతో లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. మీకు అతనితో ఏదో 'సం'బంధం ఉందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి, దీనిపై మీ స్పందన? అని ప్రశ్నించగా పియా స్పందిస్తూ...'నేను ఆ గాసిప్స్ విన్నాను. నాపై తొలిసారిగా ఇలాంటి వార్తలు వినిపిస్తుండటంతో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లిప్ లాక్ తర్వాత కాదు, లిప్ లాక్ ముందు నుంచి కూడా మా ఇద్దరి మధ్య వార్మ్ రిలేషన్ ఉంది' అంటూ వ్యాఖ్యానించారు.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రానికి మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈచిత్రం ద్వారా మహత్ రాఘవేంద్ర(తాప్సి మాజీ ప్రియడు) హీరోగా పరిచయం అవుతున్నాడు. పియా బాజ్ పాయ్, అర్చన కవి హీరోయిన్లు. మల్టీ డైమన్షన్ ప్రై.లి సమర్పణలో షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించారు.


Click it and Unblock the Notifications












