twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ జెనీలియా కొడుకు ఇలా... (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ దంపతులు నవంబర్ చివరి వారంలో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మేరీ క్రిస్ మస్‌ సందర్భంగా తన కొడుకును లిటిల్ శాంతా అవతారంలో ఫోటోలు తీసి అభిమానుల కోసం ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. ఈ ఫోటోను పోస్టు చేయడంతో పాటు తన జీవితంలో ఈ క్రిస్ మస్ ఎంతో స్పెషల్ అంటూ ట్వీట్ చేసింది జనీలియా. రితేష్ ఆమె ట్వీట్ ను రి ట్వీట్ చేసాడు. మ ఫ్యామిలీలోకి మరో కొత్త వ్యక్తి రావడంతో అంతా సంతోషంగా ఉన్నారు.

    జెనీలియా నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.

    PIC: Riteish-Genelia Baby Boy 'Riaan'

    'రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా మధ్య పెళ్లికి ముందు నుండే చాలా కాలంగా ప్రేమాయణం సాగుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్' నుండే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా డిజౌజా మధ్య దాదాపు పదేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు.

    సౌతిండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జెనీలియాకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమె సినిమాలకు దూరం కావడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు.

    English summary
    Proud parents Riteish Deshmukh and Genelia D'Souza posted their first pic on Twitter on Christmas. Riteish and Genelia became parents to baby boy Riaan in November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X