»   » పల్లెటూరి పిల్ల: ‘రంగస్థలం 1985’లో సమంత లుక్ ఇదే

పల్లెటూరి పిల్ల: ‘రంగస్థలం 1985’లో సమంత లుక్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి కుర్రాడిగా, సమంత పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటికే 'రంగస్థలం 1985' సెట్స్ నుండి రామ్ చరణ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. సమంత లుక్ ఎలా ఉంటుందనేది బయటకు రాలేదు. తాజాగా సమంతనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తన ఫోటో పోస్టు చేసింది.


Pic: Samantha In Rangasthalam 1985

అలసట, బాధ పెద్ద విషయం కాదు, కెమెరా కేవలం అద్భుతాన్నే చిత్రీకరిస్తుంది... అనే క్యాప్షన్‌తో ఈ ఫోటో పోస్టు చేశారు సమంత. లంగావోణీ ధరించి, ఓ పల్లెటూరి అమ్మాయిలా కాలువగట్టుపై కూర్చొని ఉన్న ఈ ఫోటోలో సమంత వెనక వైపు నుండి మాత్రమే కనిపిస్తోంది.


2018 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాతి బరిలో మెగాస్టార్ నిలిస్తే.... 2018 సంక్రాంతి బరిలో రామ్ చరణ్ ఇతర హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వనున్నాడన్నమాట. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


English summary
Actress Samantha posted Rangasthalam 1985 working pic in Instagram. Rangasthalam 1985 is an upcoming Indian Telugu period drama directed by Sukumar and starring Ram Charan and Samantha Ruth Prabhu in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu