చిరంజీవి చిన్న కూతురును ఇలా ఎప్పుడూ చూసుండరు... (ఫోటో)
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ప్రస్తుతం తన భర్త కళ్యాణ్‌తో కలిసి సంతోషకరమైన జీవితం కొనసాగిస్తోంది. దీపావళి సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి దిగిన ఓ ఫోటోను శ్రీజ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతేడాది మార్చిలో ఎన్నారై బిజినెస్‌మేన్ కళ్యాణ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీజ భర్తతో కలిసి సంతోషకరమైన జీవితం కొనసాగిస్తోంది. దీపావళి సందర్భంగా శ్రీజ తమ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంది.
దీపావళి సందర్భంగా భర్త కళ్యాణ్, కూతురు నివ్రుతి(మొదటి వివాహం వల్ల జన్మించిన బిడ్డ)తో కలిసి దిగిన ఫోటోను శ్రీజ షేర్ చేసింది. ముగ్గురూ కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇదే తొలిసారి.

హ్యాపీ ఫ్యామిలీ పిక్
గతేడాది మార్చిలో కళ్యాణ్‌తో పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఇలా ముగ్గురూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

హీరోగా త్వరలో ఎంట్రీ
శ్రీజ భర్త కళ్యాణ్ త్వరలో హీరోగా తెరంగ్రేటం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన నటన, ఇతర అంశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.

మెగా ఫ్యామిలీ సపోర్టు
కళ్యాణ్ చూడటానికి హీరోలా ఉన్నాడు. మెగా ఫ్యామిలీ సపోర్టు, మెగా అభిమానుల అండ కూడా ఉంది కనుక... దానికి కాస్త టాలెంట్ కూడా తోడయితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

నిజంగా ఇది నిజమా?
అంతే కాదు, చిరంజీవి కూతురు శ్రీజ కూడా సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











