ఎంజాయ్మెంట్ మూడ్: ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ ఫోటో వైరల్

By Bojja Kumar

కొన్ని వారాల నుండి ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' వేడుకకు ఎన్టీఆర్ గెస్టుగా హాజరు కావడం, అదే రోజు రాత్రి మహేష్ బాబు ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ ముగ్గురు టాప్ స్టార్స్ మధ్య మంచి అనుబంధం ఉందిని చెప్పడానికి ఆ ఫోటోలు నిదర్శనంగా నిలిచాయి. ఇది చూసిన చాలా మంది ఇండస్ట్రీలో అగ్ర హీరోల మధ్య ఆరోగ్య కరమైన పోటీ వాతావరణం ఉంది అని చర్చించుకున్నారు.

తాజాగా ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్‌కు సంబంధించిన మరో అరుదైన ఫోటో వైరల్ అయింది. మరి ఈ ఫోటో ఏ సందర్భంలో దిగిందో తెలియదు కానీ ముగ్గురు స్టార్స్ నవ్వులు చిందిస్తూ లవ్లీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ స్టార్స్ కు సంబంధించి ఏ సినిమా ఫంక్షన్ జరిగినా ఈ ముగ్గురు కలిసి ప్రేక్షకులకు కనువిందు చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా తమను అభిమానించే ఫ్యాన్స్, ఆడియన్స్ మధ్య కూడా ఒక హెల్దీ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు.

Pic Talk: Ram Charan, NTR and Mahesh Babu are all smiles

కాగా... మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'భరత్ అనే నేను' చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఇపుడు ఇదే నిర్మాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X