సెక్సీ పోస్టర్లతో ‘పిచ్చెక్కిస్తున్నారు’(ఫోటోస్)
హైదరాబాద్: స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, స్టార్ దర్శకులు, పెద్ద బేనర్లు.....వీటిలో ఏ ఒక్క అంశం సినిమాలో ఉన్నా ఆ సినిమాకు ఆటోమేటిక్‌గా పబ్లిసిటీ వచ్చేస్తుంది. మరి ఇలాంటి ప్రత్యేకతలు ఏమీ లేకుండా సినిమాలకు పబ్లిసిటీ పెంచడం చేయడం? ప్రేక్షకులను ఆకర్షించడం? అనేది కాస్త కష్టమైన విషయమే.
ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ పెంచేందుకు దర్శకులు, నిర్మాతలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. తమ సినిమా వైపు ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ అట్రాక్ట్ అయ్యేలా సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. సినిమా టైటిల్స్ స్పైసీగా పెట్టడంతో పాటు.....హీరో, హీరోయిన్లతో హాట్ అండ్ సెక్సీ రొమాంటిక్ ఫోటో షూట్లు జరిపి ఇంటర్నెట్ మీడియా ద్వారా సినిమాకు ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అలాంటి సినిమాల్లో ఒకటి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'పిచ్చెక్కిస్తా' చిత్రం. స్పైసీ టైటిల్, హాట్ అండ్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న ఈచిత్రం విశేషాలు స్లైడ్ షోలో....

హీరో హీరోయిన్లు
పిచ్చెక్కిస్తా చిత్రంలో ఎన్.కె, హరిణి జంటగా నటిస్తున్నారు.

నిర్మాణ సంస్థ
సెవెన్ ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘పిచ్చెక్కిస్తా' అనే టైటిల్ ఖరారు చేసారు.

పిచ్చెక్కిస్తా
ఈ పేరు వినగానే చాలామంది నెగెటివ్‌గా ఆలోచిస్తారు. కానీ, చిత్రంలో వున్న థ్రిల్‌కు, సంతోషానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించామని దర్శక నిర్మాత తెలిపారు.

సినిమా ఎలా ఉంటుందంటే?
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటినుండి చివరివరకూ ప్రేక్షకులు నవ్వేవిధంగా రూపొందించామని తెలిపారు దర్శక నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి.

ఫ్యామిలీ ఎంటర్టెనరేనట
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

తెర వెనక వీరే..
ఈ చిత్రానికి కెమెరా: రాము.జి., సంగీతం: నవనీత్ చారి, రచన, నిర్మాత, దర్శకత్వం: శ్రీకాంత్ రెడ్డి.

యూత్ ను ఆకట్టుకునేందుకే
ఈ ఫోటో చూస్తుంటే ఏమనిస్తోంది. హీరోయిన్ హీరోను ఎక్కడో...ఏదో చేస్తున్నట్లు ఉంది కదూ. యూత్‌ను ఆకట్టుకునేందుకే ఈ స్పైసీ ఆలోచన చేసినట్లు స్పష్టమవుతోంది.

మందు కొడుతూ..
హీరోయిన్ మందు కొడుతూ ఉన్న ఫోటో ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ హాట్ లుక్
హీరోయిన్ హరిణి హాట్ లుక్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











