హాట్ ఫోజులతో నిజంగానే పిచ్చెక్కిస్తోంది (ఫోటోస్)
హైదరాబాద్: ప్రస్తుతం సినిమా రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో అసలు అవకాశాలు దక్కించుకోవడమే గొప్ప విషయం. అందుకే అవకాశం వచ్చినపుడే ఏదో ఒకరకంగా తమకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన వారు. ఇక హీరోయిన్లయితే ఇందు కోసం తమ అందాలను పెట్టుబడిగా పెడుతున్నారు.
ఒకప్పడు ఉన్న విధంగా ఇప్పటి హీరోయిన్లకు నటన పరంగా నిరూపించుకునే అవకాశమే రావడం లేదు. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్లను అందాలు ఆరబోసే బొమ్మగానే చూపిస్తున్నారు. ఏవో కొన్ని సినిమాల్లో తప్పితే అన్ని సినిమాల్లోనూ దాదాపు ఇదే నడుస్తోంది. అందుకే వారు కూడా అందాల ఆరబోతపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సినిమాకు పబ్లిసిటీ పెంచడం కోసం విడుదల ముందు హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇవ్వడం, సినిమాలో గ్లామర్ పాత్రలు చేయడం ఇపుడు సర్వ సాధారణం అయింది.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘పిచ్చెక్కిస్తా' సినిమా విషయంలోనూ ఇదే రిపీట్ అయింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న హరిణి....సినిమా ప్రమోషన్లో భాగంగా హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

బేనర్....
7 ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో ‘పిచ్చెక్కిస్తా' చిత్రం తెరకెక్కుతోంది.

హీరో హీరోయిన్లు
ఎన్.కె, హరిణి జంటగా ‘పిచ్చెక్కిస్తా' చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ రెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతోంది.

శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ..
ఈ పేరు వినగానే చాలామంది నెగెటివ్‌గా ఆలోచిస్తారు. కానీ, చిత్రంలో వున్న థ్రిల్‌కు, సంతోషానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించామని తెలిపారు.

రొమాంటిక్ కామెడీ...
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటినుండి చివరివరకూ ప్రేక్షకులు నవ్వేవిధంగా రూపొందించామని తెలిపారు.

కుటుంబ సమేతంగా చూడొచ్చు...
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

తెర వెనక
ఈ చిత్రానికి కెమెరా: రాము.జి., సంగీతం: నవనీత్ చారి, రచన, నిర్మాత, దర్శకత్వం: శ్రీకాంత్ రెడ్డి.

విడుదల తేదీ...
ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











