»   » రాజమౌళి.... నువ్వు మామూలోడివి కాదు!

రాజమౌళి.... నువ్వు మామూలోడివి కాదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా నూట యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి'. మరి ఈ రేంజిలో డబ్బు ఖర్చు పెడుతున్న రాజమౌళి తిరిగి ఆడబ్బులను రాబట్టుకునే మార్గాలపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నాడు.

‘బాహుబలి' సినిమా రూపకల్పనకు మాస్టర్ మైండ్ రాజమౌళి. రాజమౌళితో సినిమా అంటే లాభాలే తప్ప నష్టాలు ఉండవనే నమ్మకంతోనే వందల కోట్లు ఖర్చు పెట్టారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తనదైన రీతిలో సినిమాకు మార్కెటింగ్ చేస్తున్నాడు రాజమౌళి.


బాహుబలి స్టోర్


Pick up your Baahubali collections

తాజాగా ఆన్ లైన్లో బాహుబలి స్టోర్ ఓపెన్ చేసారు. ఇందులో సినిమా పోస్టర్లు, బాహుబలి లోగోలతో కూడిన టీషర్లు, పోలో టీ షర్టులు, వి నెక్స్, హూడీస్ తదితర వస్తువులు అమ్మకానికి పెట్టారు. వీటి అమ్మకం వల్ల డబ్బుల పరంగా ఒరిగేదేమీ లేక పోయినా సినిమాకు పబ్లిసిటీ పరంగా ఉపయోగపడతాయనేది వారి ఆలోచన. భవిష్యుత్తులో ఇదే స్టోర్ ద్వారా ‘బాహుబలి'కి సంబంధించిన ఆడియో సీడీలు, సినిమా సీడీలు కూడా అమ్ముతారని టాక్.


మరో వైపు ‘బాహుబలి' సినిమాకు సంబంధించి హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్ కుదిరింది. దీన్ని బట్టి ‘బాహుబలి' రేంజి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రెండున్నరేళ్ల కష్టానికి రెండింతల ప్రతిఫలం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దటీస్ రాజమౌళి.

English summary
Pick up your Baahubali collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu