పసిడి కాంతుల మధ్య ఐశ్వర్యరాయ్ (ఫోటోస్)
హైదరాబాద్: అందాల సుందరి ఐశ్వర్యరాయ్ బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ యాడ్ ఫిల్మ్స్, ఇతర వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ హీరోయిన్లతో సమానంగా తన ఉనికిని చాటుకుంటోంది.
ఐశ్వర్యరాయ్ ప్రమోట్ చేస్తున్న కార్పొరేట్ బ్రాండ్లలో కళ్యాణ్ జ్యువెల్లర్స్ కూడా ఒకటి. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో ఆమె చేతుల మీదుగా సదరు సంస్థ కొత్త షోరూంలను ప్రారంభించింది. తాజాగా కళ్యాణ్ జ్యువెల్లరీ 65వ షోరూంను ముంబైలో ఐశ్వర్యరాయ్ ప్రారంభించారు. పసిడి కాంతుల మధ్య గులాబీ వర్ణపు చీరకట్టులో ఐశ్వర్యరాయ్ మరింతగా వెలిగిపోయింది.
ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ...కళ్యాణ్ జ్యువెల్లర్స్ లాంటి అతిపెద్ద ఆభరణాల సంస్థకు ప్రచారం కర్తగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

వన్నెతరగని అందం
42 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో ఐశ్వర్యరాయ్ మెరిసిపోతోంది. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

షోరూం ప్రారంభోత్సవంలో...
ముంబైలో ఐశ్వర్యరాయ్ ప్రారంభించిన ఈ షోటో దేశ వ్యాప్తంగా 65వది కాగా, ముంబైలో 4వది.

అమ్మకాలు పెరిగాయి
ఐశ్వర్యరాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల తమ అమ్మకాలు పెరిగాయని కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ అంటోంది.

అభిమానులు
ముంబైలో ఐశ్వర్యరాయ్‌ని చూసేందుకు వచ్చిన అభిమానులు.

త్వరలో మళ్లీ సినిమాల్లోకి...
త్వరలో ఐశ్వర్యరాయ్ సంజయ్ గుప్తా ‘జాజ్బా' ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











