బిగ్‌బి ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్, స్టార్స్ సందడి (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ బచ్చన్ ఫ్యామిలీ ఈ సారి దివాళీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. ముంబైలోని తన జల్సా రెసిడెన్సీలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్టార్స్ రాకతో జల్సా రెసిడెన్సీ సందడిగా మారింది.
హృతిక్ రోషన్, దీపిక పదుకోన్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, టబు,అనిల్ కపూర్ ఇలా అమితాబ్‌కు సన్నిహితంగా ఉండే ప్రముఖులంతా హాజరయ్యారు. గర్భతిగా ఉన్న హీరోయిన్ జెనీలియా కూడా తన భర్త రితేష్ దేశ్ ముఖ్‌తో కలిసి హాజరైంది. బాలీవుడ్లో ఇప్పటి వరకు జరిగిన గ్రేట్ దివాళీ సెలబ్రేషన్స్ ఇవే అని అంతా చెప్పుకుంటున్నారు.
బచ్చన్ ఫ్యామిలీ నిర్వహించిన ఈ వేడుకకు సంబంధించని ఫోటోలు స్లైడ్ షోలో....

నిర్వహణ
స్టార్ కపుల్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి ఈ దివాళీ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

సీనియర్ బచ్చన్, అర్జున్ కపూర్
దివాళీ సెలబ్రేషన్స్‌లో సీనియర్ బచ్చన్‌తో కలిసి అర్జున్ కపూర్.

గ్రూపు ఫోటో
హృతిక్ రోషన్, ఆదిత్య రాయ్ కపూర్, నర్గీస్ ఫక్రి తదితరులు ఇలా గ్రూఫుగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

సోనాక్షి సిన్హా
ట్రెండీ సారీ ధరించి సూపర్ హాట్ లుక్‌తో సోనాక్షి సిన్హా ఈ వేడుకకు హాజరైంది.

వరుణ్ ధావన్
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ జల్సా రెసిడెన్సీకి హాజరవుతున్న దృశ్యం.

శ్రద్ధా కపూర్
లెహంగా ధరించి హాట్ అండ్ సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చిన శ్రద్ధా కపూర్.

శృతి హాసన్
బ్లాక్ సారీ ధరించి అమితాబ్ ఇంట్లో జరిగిన దివాళీ వేడుకలకు హాజరైన శృతి హాసన్.

రితేష్ దేశ్ ముఖ్-జెనీలియా
గర్భతిగా ఉన్న హీరోయిన్ జెనీలియా తన భర్త రితేష్ దేశ్ ముఖ్‌తో కలిసి హాజరైంది.

పర్హాన్ అక్తర్
అమీర్ ఖాన్ దివాళీ పార్టీ నుండి నేరుగా అమితాబ్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరయ్యారు ఫర్హాన్ అక్తర్.

అమృత
సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్య అమృత తన కొడుకుతో కలిసి దర్శనమిచ్చారు.

ప్రాచీ దేశాయ్
ఈ దివాళీ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ కూడా పాల్గొన్నారు.

భర్తతో కలిసి సోనాలీ
భర్తతో కలిసి దివాళీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సోనాలి బింద్రే.


Click it and Unblock the Notifications











