»   »  సల్మాన్ ఖాన్ ఇంట్లో గణేష్ పూజ, సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

సల్మాన్ ఖాన్ ఇంట్లో గణేష్ పూజ, సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ దాదాపు 14 ఏళ్లుగా ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సల్మాన్ చిన్న చెల్లెలు అర్పిత ఖాన్ ద్వారా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని సల్మాన్ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ తండ్రి ముస్లిం ఫ్యామిలీకి చెందిన సలీమ్ ఖాన్ కాగా, తల్లి హిందూ కుటుంబానికి చెందిన సుశీలా చరక్. తాను సగం హిందూ, సగం ముస్లిం అని సల్మాన్ అనేక సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు కూడా. సల్మాన్ ఫ్యామిలీలో అన్ని మతాల వారు ఉన్నారు. అందుకే వారు అన్ని మతాల పండగలను జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాలతో సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ సందడిగా ఉంటుంది. ఈ సారి కూడా ఇక్కడే గణేష్ నవరాత్రి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రతి సంవత్సరం సల్మాన్ ఫ్యామిలీ గణపతి బప్పా విగ్రహాన్ని బంద్రాలోని బీచ్‌లో నిమజ్జనం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సల్మాన్ చెల్లెలు అర్పిత ఖాన్ పర్యావరణానికి హానికలిగించని ఎకో ఫ్రెండ్లీ గణపతి బప్పా విగ్రహాన్ని తయారు చేయించింది.

స్లైడ్ షోలో ఫోటోస్.....

గణేషుడు

గణేషుడు


సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్టుమెంటులో కొలువుదీరిన గణేషుడు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


గణేష్ పూజ సందర్భంగా సల్మాన్ ఖాన్ చాలా సంతోషంగా కనిపించాడు.

ఎకోఫ్రెండ్లీ..

ఎకోఫ్రెండ్లీ..


సల్మాన్ ఖాన్ ఇంట్లో కొలువుదీరిన ఎకో ఫ్రెండ్లీ గణేషుడు.

సూపర్బ్ డెకరేషన్

సూపర్బ్ డెకరేషన్


గెలాక్సీ అపార్టుమెంటులో గణేష్ మండపాన్ని సూపర్బ్ గా డెకరేట్ చేసారు.

సల్మాన్, అమీ

సల్మాన్, అమీ


గణేష్ పూజకు హాజరైన అమీ జాక్సన్‌తో కలిసి సల్మాన్ ఖాన్.

అర్పితా ఖాన్

అర్పితా ఖాన్


గణేష్ పూజకు సంబంధించిన వ్యవహారాలన్నీ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖానే చూసుకుంటుంది.

English summary
Salman Khan has been celebrating Ganesh Chaturthi religiously from 2001! Ever since his sister Arpita insisted on getting the idol home, the khan family has been celebrating the festival diligently year after year.
Please Wait while comments are loading...