నాకు భయం సార్ అంటూ పవన్ కళ్యాణ్... ఎన్టీఆర్, త్రివిక్రమ్ నవ్వులు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియలో సోమవారం జరిగింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవం సోమవారం రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Recommended Video

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ చాలా జోవియల్‌గా కనిపించారు. చాలా సరదా సరదాగా గడిపారు. పవన్ కళ్యాణ్ మధ్య మధ్యలో జోకులు పేల్చడం... ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో పాటు ఇతర యూనిట్ సభ్యులంతా కడుపుబ్బా నవ్వడం లాంటివి చోటు చేసుకున్నాయి.

భయం సార్, చేతులు వణుకుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ మీద చిత్రీకరించే ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాల్సిందిగా సూచిస్తూ పవన్ కళ్యాణ్ చేతికి క్లాప్ బోర్డ్ అందించారు త్రివిక్రమ్. దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... ఇలాంటివంటే నాకు భయం సార్, చేతులు వణుకుతున్నాయంటూ వ్యాఖ్యానించడంలో అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి.

ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్ మధ్య సరదా సరదాగా
ఎన్టీఆర్ మీద ముహూర్తం షాట్ చిత్రీకరిస్తుండగా.... సార్ నేను ఇటు ఫోటోల వైపు తిరిగి దండం పెట్టాలా? లేక కెమెరా వైపు తిరిగి దండం పెట్టాలా? అంటూ ఎన్టీఆర్ సందేహ పడటంతో..... వెంటనే అందుకున్న పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామికి పెట్టండి సార్ అంటూ సూచించారు.

క్లాప్ కొట్టి అక్కడే కిందకు వంగి కూర్చున్న పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ మీద చిత్రీకరించే ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన అనంతరం పక్కకు జరిగేందుకు స్థలం లేక పోవడంతో.... కెమెరాకు అడ్డు రాకూడదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ అక్కడే కిందకి వంగి కూర్చోవడం గమనార్హం.

ఆత్మీయ ఆలింగనం
ముహూర్తం షాట్ చిత్రీకరణ జరిగిన అనంతరం ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అనిరుధ్‌ను చేయి పట్టి తీసుకెళ్లి మరీ ఫోటో దిగిన పవర్ స్టార్
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పక్కకు నిల్చొని ఉండగా స్వయంగా అనిరుధ్ చేయి పట్టుకుని తీసుకెళ్లి మరీ తీసుకెళ్లి ఫోటో దిగారు పవన్ కళ్యాణ్.

నన్ను తొక్కేస్తున్నారంటూ త్రివిక్రమ్
సినిమా ప్రారంభోత్సవం జరిగిన అనంతరం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఫోటోలు దిగేందుకు అక్కడికి వచ్చిన వారంతా పోటీ పడ్డారు. అందరూ వరుసగా వస్తుండటంతో నన్ను ఫోటోలు దిగకుండా తొక్కేస్తున్నారంటూ..... త్రివిక్రమ్ సరదాగా వ్యాఖ్యానించారు.

ఏమిటా చేయి వేయడం... తీయండి అంటూ ఎన్టీఆర్ సున్నితంగా మందలింపు
ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ యాక్టర్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లపై చేతులు వేసి ఫోటో దిగే ప్రయత్నం చేశారు. దీనికి ఎన్టీఆర్ యాక్టర్ అవుతూ ఏమిటా చేతులు వేయడం, ఎంత సేపు వేస్తారు, తీసేయండి అంటూ సుతిమెత్తగా మందలించారు.

ఎన్టీఆర్ 28
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ(చిన్న బాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











