హీరోయిన్ అంజలి ఆఖరి రోజు ఇలా....(ఫోటోలు)
హైదరాబాద్: అంజలి ప్రధాన పాత్రలో 'గీతాంజలి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ సమకూర్చారు.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆఖరి రోజు షూటింగ్ సందర్భంగా బ్రహ్మానందం, కోనవెంకట్, శ్రీనివాసరెడ్డి, రావు రమేష్, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్ తదితరులతో దిగిన ఫోటోను అంజలి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది. టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ఈ చిత్రం కోసం సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. రాప్ మ్యూజిక్ స్టార్‌గా దర్శనమివ్వబోతున్నాడు.
'గీతాంజలి' సినిమా ప్రమోషన్ సాంగులో బ్రహ్మీ ఈ సరికొత్త లుక్‌లోకి మారబోతున్నాడు. ఈ పాటను ప్రముఖ రాపర్, పాప్ సింగర్ బాబా సెహగల్ పాడబోతున్నారు. స్లైడ్ షోలో ఫోటోలు మరిన్ని వివరాలు...

ఆఖరి రోజు షూటింగ్
షూటింగ్ చివరి రోజు తన కోస్టార్స్‌తో కలిసి దిగిన ఫోటోను అంజలి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.

గీతాంజలి
గీతాంజలి చిత్రం ద్వారా ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడిగా, శ్రీజో గేయ రచయితగా పరిచయమవుతున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా మొదలవుతుంది.

శ్రీనివాసరెడ్డి
ఇప్పటివరకు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి మూల స్తంభం వంటి ప్రధాన పాత్ర చేశాడు. సత్యం రాజేశ్ ఓ కీలక పాత్ర చేశాడు.

విడుదల ఎప్పుడంటే...
ఆగస్ట్ మొదటి వారంలో సినిమానీ విడుదల చేయబోతున్నారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు తారాగణమైన ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.


Click it and Unblock the Notifications











