»   » మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు వేడుక (ఫోటోస్)

మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు తమ రెండో సంతానంగా సితారకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జులై 20, 2012న సితార జన్మించింది. ఈ నెల 20వతో సితార తన 4వ ఏట అడుగు పెట్టింది.

సింపుల్‌గా లైఫ్ స్టైల్ లీడ్ చేసే మహేష్ బాబు.... కూతురు పుట్టినరోజు విషయంలో కూడా పెద్దగా ఆర్భాటాలకు పోలేదు. ఇంట్లోనే సింపుల్ గా కేక్ కట్ చేసి కూతురుతో గడిపారు. ఇందుకు సంబందించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

సితార గత పుట్టినరోజు వేడుకలు కూడా ఇలానే సింపుల్ గా జరిగాయి. సితార అంటే మహేష్ బాబుకు ప్రాణం. కూతురును తన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారాయన. మహేష్ బాబు ఎంత బిజిగా ఉన్న మొదటి ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం కుటుంబంతో గడపడానికే. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎలాంటి పనులు పెట్టుకోకుండా కూతురు పుట్టినరోజున కుటుంబంతోనే టైమ్ స్పెండ్ చేసారు.

నిండా నాలుగేళ్లు కూడా నిండక ముందే సితార సినిమా సెలబ్రిటీ అయింది. మహేష్ బాబు సినిమా షూటింగ్ సెట్లో అందరికీ క్లోజ్ అయంది. రేవతి, సమంత లాంటి స్టార్లతో సితార ఫ్రెండ్షిప్ చేస్తోందంటే.... పాపాయి ఇంత చిన్న వయసులోనే ఎంత మెచ్యూర్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్లైడ్ షోలో సితార పుట్టినరోజు వేడుకలు...

కేక్ కటింగ్

కేక్ కటింగ్

ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేస్తున్న సితార.

సితార

సితార

బహుషా ఇది సితార చదువుతున్న ప్లే స్కూల్ అయి ఉంటుంది.

ఫుల్ ఫన్

ఫుల్ ఫన్

సితార పుట్టినరోజు ఎంతో హ్యాపీగా గడిచింది అనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

సూపర్ క్యూట్

సూపర్ క్యూట్

నమ్రత శిరోద్కర్ సూపర్ క్యూట్ లుక్...

నాలుగు

నాలుగు

జులై 20, 2012న సితార జన్మించింది. ఈ నెల 20వతో సితార తన 4వ ఏట అడుగు పెట్టింది.

English summary
Superstar Mahesh Babu's little princess Sitara celebrated her Birthday the other day and the actor made sure to spend some quality time with family on the special day and make it a memorable one. "A perfect round off to her birthday making a wish n blowing candles with her father dearest", posted Namrata.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu