పిక్చర్స్: ఊపేస్తున్న మేఘనా ఐటమ్ సాంగ్, కానీ..

By Pratap

బెంగళూర్: కన్నడ సినిమా పరారీలోలోని మేఘనా నాయుడు ఐటమ్ సాంగ్ విడుదలైంది. హర్ష దానికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇంటర్నెట్‌లో అది ఊపేస్తుంది. దర్శకుడు కెఎం చైతన్య దాన్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. బీజా బీజా అనే ఈ ఐటమ్ సాంగ్ గురించి దర్శకుడు చెబుతూ - తన తాజా చిత్రం పరారీలోని తొలి పాటను విడుదల చేస్తున్నాని, నాగేంద్ర ప్రసాద్ పాట రాయగా, అనూప్ సీలిన్ కంపోజ్ చేశారని అన్నారు.

మేఘనా నాయుడుతో తీసిన ఈ ఐటమ్ సాంగ్‌ని పంచుకోవాలని కూడా సూచించారు. అయితే, ప్రాంతీయ సెన్సార్ బోర్డులో మాత్రం ఆ పాటకు కష్టాలు వచ్చి పడ్డాయి. పాటకు, మేఘనా నాయుడు కాస్యూమ్స్‌కు సెన్సార్ బోర్డులో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాటలో శివ అనే పదాన్ని వాడడం, మెఘనాకు కాషాయం రంగు దుస్తులు వేయడం సమస్యగా మారింది.

పిక్చర్స్: ఊపేస్తున్న మేఘనా ఐటమ్ సాంగ్, కానీ..

మేఘనా నాయుడు పాటపై సెన్సార్ బోర్డు అభ్యంతరాల పట్ల దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవుడి పదం వాడడం వల్ల ఎవరి మనోభావాలు కూడా దెబ్బ తినబోవని ఆయన వాదిస్తున్నారు. దేవుడిని తక్కువ చేసే విధంగా దాన్ని వాడలేదని సమర్థించుకున్నాడు.

పిక్చర్స్: ఊపేస్తున్న మేఘనా ఐటమ్ సాంగ్, కానీ..

దేవుడి పేరు ప్రస్తావించిన పాటలు చాలా ఉన్నాయని, బోర్డు ఈ పాటను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకుందో అర్థం కావడం లేదని అంటున్నారు.

పిక్చర్స్: ఊపేస్తున్న మేఘనా ఐటమ్ సాంగ్, కానీ..

చివరకు బోర్డు సూచనకు దర్శకుడు సానుకూలంగా ప్రతిస్పందించి శివ అనే పదాన్ని జీవ అనే పదంతో భర్తీ చేశాడు. అయితే, దాన్ని పునపరిశీలించాలని ఆయన బోర్డును కోరారు.

పిక్చర్స్: ఊపేస్తున్న మేఘనా ఐటమ్ సాంగ్, కానీ..

కాగా, ఈ నెంబర్‌ను ఆయన టెలివిజన్ చానెళ్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

పిక్చర్స్: ఊపేస్తున్న మేఘనా ఐటమ్ సాంగ్, కానీ..

శక్తి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో శుభ పూంజా, జాహ్నవి కామత్, శ్రవంత్ రావు, శృఘ్న, బుల్లెట్ ప్రకాష్, సాధు కోకిల నటిస్తున్నారు.

బంగీ, శివ అనే పదాలు, కాషాయం రంగు టీ షర్ట్ ఓ వర్గం మనోభావాలను దెబ్బ తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. సెన్సువల్ ట్రాక్‌లో భగవంతుడి పదం వాడడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X