న్యూ ఇయర్ వేడుకల్లో అదరగొట్టిన నమిత(ఫోటోలు)
బెంగుళూరు: న్యూ ఇయర్ వేడుకల్లో అందాల బొద్దుగుమ్మ నమిత సందడి చేసింది. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముగ్బల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో తన లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను అలరించింది. ఇటీవల వచ్చిన పలు సూపర్ హిట్ సాంగులకు స్టెప్పులేసి ప్రేక్షకులను తన అందాలతో మత్తెక్కించింది.
ఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను నమితకు భారీగానే(లక్షల్లో) రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా న్యూఇయర్ నైట్ తను కోరిన విధంగా విందు ఏర్పాట్లు కూడా చేసారట. ఏది ఏమైనా ఇంత కాలం కేవలం తెరపై కనిపించిన నమిత నేరుగా తమ కళ్లముందు కనిపించడంతో ఆమె అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోయారు.
నమిత ప్రస్తుతం దాదాపు 7 చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలో నాలుగు, తెలుగులో రెండు, తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. జగదాంబ, సిక్కపట్టె ఇస్తాపట్టె, బెంగి బిరుంగల్లె, పార్వతిపుర ఆమె నటిస్తున్న కన్నడ చిత్రాలు కాగా, తెలుగులో సర్కార్ గుండా, శుక్ర, తమిళంలో మచ్చన్ అనే చిత్రాలు చేస్తోంది.

జెఎంఎస్ గ్రూఫు వారు న్యూఇయర్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. నమిత ఈ కార్యక్రమంలో రెండు తెలుగు పాటలకు, ఒక కన్నడ పాటకు డాన్స్ చేసింది.

నమితను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

ఈ షో ఇవ్వడానికి నమిత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందని చర్చించుకుంటున్నారు.

ఆమె కెరీర్ విషయానికొస్తే...తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

త్వరలో ఆమె తెలుగులో సర్కార్ గుండా, శుక్ర అనే చిత్రాల్లో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











