»   » ఫొటోలు, వీడియో : ఏదైమైనా 'బాహుబలి' టీమ్ లెక్కే వేరబ్బా

ఫొటోలు, వీడియో : ఏదైమైనా 'బాహుబలి' టీమ్ లెక్కే వేరబ్బా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ హరిత హారంలో సినిమా వాళ్లు చాలా ఏక్టివ్ గా పార్టిసిపేట్ చేసారు. ఇందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి టీమ్ మొక్కలు నాటారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇందులో హీరోయిన్స్ మాత్రం మిస్సయ్యారు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ వీళ్లెవరూ ఈ పోగ్రాంలో పాలుపంచుకున్నట్లు లేరు.

రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటడంతో ప్రారంభమైన ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటడంతో ముగిసిందని ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, హీరో ప్రభాస్‌, యూనిట్‌ సభ్యులతో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో రానా పంచుకున్నారు. అలాగే టీం మొక్కలు నాటుతున్నప్పటి వీడియో.

ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాలుపంచుకున్నారు. సోమవారం వేర్వేరుచోట్ల తారలు మొక్కలు నాటి సమాజంలో తమ వంతు బాధ్యతను గుర్తు చేశారు. మానవ మనుగడకు మొక్కలు ప్రాణాధారమని తెలుపుతూ తమ అభిమానులు సైతం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే...బాహుబలి ..ది కంక్లూజన్ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ మేరకు రామోజి ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన సెట్ లో షూటింగ్ జరిగింది. మబ్బులతో షూటింగ్ కు అంతరాయం కలగకుండా..100 KW డే లైట్స్ వాడి షూటింగ్ కంప్లీట్ చేసారు.

బాహుబలి టీమ్ ..హరిత హారం ఫొటోలు...

షేర్ చేసారు

షేర్ చేసారు

ఇక హరిత హారంలో పాల్గొన్న బాహుబలి టీమ్ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేసారు.

సెల్పీ

సెల్పీ

వీరందిరితో కలిసి రానా దిగిన సెల్ఫీ భలే ఉంది కదా

హీరో, దర్శకుడు

హీరో, దర్శకుడు

హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి..మొక్కలకు నీళ్లు పోస్తూ ఇలా..

అందరూ

అందరూ

హీరో,విలన్, దర్శకుడు, నిర్మాత అందరూ ఇలా ఒకేసారి కష్టపడుతున్నారు మొక్కలు సంరక్షణ కోసం..

ప్రభాస్

ప్రభాస్

ప్రభాస్ మొక్క నాటే పనిలో నిమగ్మమై ఉన్న క్షణాలు ఇవి.

నీళ్లు పోయటమే

నీళ్లు పోయటమే

హమ్మయ్య పాతటం పూర్తైంది, నీళ్లు పోయటమే మిగిలింది. ఆ పని కూడా...

రానా కు ఏదో

రానా కు ఏదో

అందరూ పనిలో ఉంటే రానా కుఏదో మెసేజ్ వచ్చినట్లుందే చూసుకుంటున్నాడు.

సెల్ఫీలే సెల్ఫీలు

సెల్ఫీలే సెల్ఫీలు

రానా..సెల్పీ రాజా గా మారిపోయి సెల్ఫీలు తీస్తూనే ఉన్నాడు

షూటింగ్ లో ఉన్నట్లే

షూటింగ్ లో ఉన్నట్లే

షూటింగ్ లో ఎంత లీనమై పనిచేస్తారో అలాగే వీళ్లంతా ఈ కార్యక్రమంలోనూ

పూర్తైంది

పూర్తైంది

నాటే కార్యక్రమం పూర్తైంది. ఇక ఫొటోలు దిగటమే మిగిలింది కదూ..

ఉషారుగా

ఉషారుగా

ప్రభాస్ చాలా ఉషారుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు అతని ఫేస్ చూస్తే అర్దం అవుతోంది.

ఇనేషియేటివ్

ఇనేషియేటివ్

రాజమౌళి మొదట ఈ కార్యక్రమానికి టీమ్ తో ఇనేషియేటివ్ చేసి మొదలెట్టారు

ఫొటో వంకే

ఫొటో వంకే

మొక్కకు నీళ్లు పోస్తూ ఫొటో తీస్తున్నవారి వైపు చూస్తున్నాడు భల్లారి దేముడు

English summary
"we took part in the #HarithaHaram program and planted a number of saplings around our shooting location", read a tweet from the Baahubali movie's official handle, along with the pictures of Prabhas, Rajamouli, Rana Daggubati and their entire team planting the saplings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu