ఒకే వేదికపై: కమల్,రజనీ,శ్రీదేవి,అమితాబ్, ఇళయరాజా (ఫొటోలు)
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, శృతిహాసన్, ధనుష్, శ్రేయా ఘోషల్, శ్రీదేవి వీరంతా ఒకే వేదికపై కనపడితే ఎలా ఉంటుంది..ఆ ఆనంద క్షణాలే మీరు ఇప్పుడు ఫొటోల్లో చూడబోయేది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఫిల్మ్ కంపోజర్ గా 1,000 వ చిత్రం ఆడియో పంక్షన్ లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇంతకీ ఆ అద్బుతం జరిగిన చిత్రం ఏమిటీ అంటారా..మరేదో కాదు...అమితాబ్, ధనుష్ కాంబినేషన్ లో రూపొందుతున్న షమితాబ్. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి సినిమా యూనిట్ తో పాటు గుల్జార్, జయా బచ్చన్ వంటి ప్రముఖలు హాజరయ్యారు.
అమితాబ్ మాట్లాడుతూ...ఇళయరాజాని ఓ జీనియస్ గా అభివర్ణించారు. ఆయన చెప్తూ... నేను ఎప్పుడూ ఇళయరాజా ఎదుర పాట పాడటానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే నేను ఆయనంతటి గొప్ప వ్యక్తి ఎదురుగా పాడటమనేది చాలా ఎంబ్రాసింగ్ మూమెంట్ గా ఫీలయ్యాను. ప్రతీసారి నేను పాట పాడేటప్పుడు సెపరేట్ గా స్టూడియోలో కూర్చున్నాను. నాకు ఇంకా పా చిత్రం సమయంలో ఇళయరాజా ఎదురుగా కూర్చుని పాడటమనేది గుర్తుంది అన్నారు.
ఆడియో వేడుక ఫొటోలు మీరు వీక్షించండి...

శ్రీదేవి, కమల్, రజనీ
కలమ్ హాసన్ మాట్లాడుతూ.. , "రాజా నా జీవితంలో ఓ భాగం. ఈ రోజు ఆయన్ను కౌగలించుకునే అవకాసం వచ్చింది. ఆయన కొద్దిగా సిగ్గరి. ఆయన వెయ్యి సినిమాలు పూర్తి చేస్తారని నాకు తెలుసు. ఆ జర్నిలో నా 786 సినిమా కూడా నాది కావటం నా అదృష్టం ." అన్నారు.

అమితాబ్ మాట్లాడుతూ...
"నేను ఎప్పుడూ ఇళయరాజా ఎదుర పాట పాడటానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే నేను ఆయనంతటి గొప్ప వ్యక్తి ఎదురుగా పాడటమనేది చాలా ఎంబ్రాసింగ్ మూమెంట్ గా ఫీలయ్యాను. ప్రతీసారి నేను పాట పాడేటప్పుడు సెపరేట్ గా స్టూడియోలో కూర్చున్నాను. నాకు ఇంకా పా చిత్రం సమయంలో ఇళయరాజా ఎదురుగా కూర్చుని పాడటమనేది గుర్తుంది.," అన్నారు.

ఇళయారాజా సన్మానం
అమితాబ్ శాలువా కప్పి ఇళయారాజా కి సన్మానం చేసారు. శ్రీదేవి, రజనీ, కమల్ ఆ స్టేజీపై పాలు పంచుకోవటం అరుదైన సంఘటన

ధనుష్-ఐశ్వర్య
ధనుష్ మాట్లాడుతూ...
"ధాంక్యూ ప్రతీ ఒక్కరికీ.. నేను ఇళయారాజా గారికి డివోటెడ్ ఫ్యాన్ ని..ఆయన సంగీతం నాకు పెద్ద ప్రేరణ ని ఇచ్చే సాధనం.. ," అన్నారు.

ఐశ్వర్య-అభిషేక్
అభిషేఖ్ బచ్చన్ మాట్లాడుతూ... ఇలాంటి వేడుక లో నేను పాల్గొనటం చాలా గౌరవంగా ఫీలవుతున్నాను అన్నారు.

గుల్జార్-జయాబచ్చన్
గుల్జార్,జయబచ్చన్ వచ్చి ఇళయరాజాకు అభినందనలు తెలియచేసారు.

కమల్-శృతి
కమల్ హాసన్ మాట్లాడుతూ...నేను ఓ సారి విచిత్రమైన సమస్యని ఎదుర్కొన్నాను. పాటల షూటింగ్ పూర్తైంది. పాటలు లేవు. అప్పుడు ఆయన ఆ పాటలకు సంగీతంతో డబ్బింగ్ చెప్పారు అన్నారు.

కమల్ కంటిన్యూ చేస్తూ...
ఇళయారాజా ఎంత గొప్పవారంటే ఎదురుగా నా లిప్ సింక్ చూసి పాటలు కంపోజ్ చేసారు అన్నారు.

ట్రిబ్యూట్
షమితాబ్ ఆడియో పంక్షన్ పూర్తిగా ఇళయరాజాకు ట్రిబ్యూట్ గా జరిగింది.

శ్రేయా ఘోషల్
ఈ లైవ్ ఈవెంట్ లో సింగర్ శ్రేయా ఘోషల్ ప్రత్యేక ఆకర్షణగా మారారు.

టబు
ఈ ఫంక్షన్ లో మరో అరుదైన గెస్ట్ వచ్చారు. ఆమె ఎవరో కాదు...టబు

తల్లి-కూతుళ్లు
అక్షర హాసన్ ఆమె తల్లి సారిక తో కలిసి ఇలా ఈ ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్నారు.

విడుదల
ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి 6 న విడుదలకు సిద్దమవుతోంది.

శ్రీదేవి
అనంతరం ..శ్రీదేవి తన అభిమాన సంగీత దర్శకుడుకు సన్మానం చేసారు

అందరూ...
బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు బప్పీలహరి, అను మాలిక్ వంటి వారు సైతం ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











