పిక్చర్స్: రణబీర్ పొసెసివ్‌గా అంటున్న దీపికా
ముంబై: ఐదేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే రణబీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. కరణ్ జోహర్ యే జవానీ హై దీవానీ చిత్రంలో ఆమె రణబీర్ కపూర్‌తో జత కట్టింది. తనపై బర్ఫీ నటుడు ఇంకా పోసెసివ్‌గానే ఉన్నాడని ఆమె రణబీర్ కపూర్‌పై వ్యాఖ్యానించింది.
తాను ఇంకా రణబీర్ స్వాధీనంలోనే ఉన్నట్లు భావిస్తున్నాడని, ఇతరుల గురించి మాట్లాడితే ఇష్టపడడం లేదని దీపికా పదుకొనే పిటిఐ వార్తా సంస్థతో అన్నది. వీరిద్దరు కలిసి చివరిసారి బచ్నా యే హసీనో చిత్రంలో 2008లో కలిసి నటించారు. అన్ని విధాల ప్రస్తారణ చేశామని, కెమికల్ కాంబినేషన్‌ను పరీక్షించుకున్నామని, ఆ తర్వాత సినిమా చేయడానికి అంగీకరించామని ఆ భామామణి అంటోంది. యే జవానీ హై దీవానీ రోమాంటిక్ చిత్రం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాైరు.
రణబీర్‌పై దీపికా ప్రశంసల జల్లు కురిపించింది. అతను సహజ నటుడని అన్నది. ఎంత కష్టమైన దృశ్యమైనా సరే ముందస్తు సంసిద్ధత ఉండదని, ఎప్పుడు కూడా ఒత్తిడికి గురి కాడని, ఆందోళన చెందడని ఆమె అన్నది. బిగ్ స్టార్‌గా రణబీర్ అవతరించాడని పొగడిసేంది. అతనితో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని చెప్పింది. అతని గురించి తాను గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పింది.

యే జవానీ హై దీవానీ చిత్రంలో రణబీర్ - దీపికా

యే జవానీ హై దీవానీ ఫస్ట్ లుక్

కొన్నేళ్ల క్రితం రణబీర్, దీపికా జంట విడిపోయింది

యే జవానీ హై దీవానీ చిత్రం టీమ్‌తో రణబీర్, దీపికా

బ్రేకప్ తర్వాత కూడా దీపికా, రణబీర్ మిత్రులుగానే ఉన్నారు.

యే జవానీ హై దీవానీ సెట్స్‌లో రణబీర్, దీపికా


Click it and Unblock the Notifications