»   » ఫ్రెండ్ బర్తడే పార్టీలో హీరో గారి కూతురు రెచ్చిపోయి చిందులు,మండిపడ్డ తల్లి (ఫొటోలు)

ఫ్రెండ్ బర్తడే పార్టీలో హీరో గారి కూతురు రెచ్చిపోయి చిందులు,మండిపడ్డ తల్లి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వారసులు కావాలని ప్రతీ ఒక్కళ్ళూ కోరుకుంటారు. ముఖ్యంగా డబ్బు, గ్లామర్ ఉండే సినిమా ఫీల్డ్ లో అయితే మరీను. తమ వారసులను తమ గ్లామర్ కు, కీర్తికి ప్రతినిధులుగా చేసి నిలబెట్టాలనుకుంటారు. అందులో కొత్తేమీ లేదు. వింత అంత కన్నా లేదు. అయితే వారసులు వచ్చినప్పుడే సమస్యలు ఎదురౌతాయి.

కొడుకులు హీరోలు అయి తమ వారసత్వాన్ని నిలబడితే సంతోషించే సీనియర్ హీరో తండ్రులు, తమ కుమార్తెలు కాస్త గ్లామర్ గా కనపడి అందరి నోళ్లలో పడేసరికి కంగారుపడతారు. వాళ్లకు పెళ్లి చేసి ఎప్పుడు ఓ అయ్య చేతిలో పెట్టేసి, చేతులు దులుపుకుందామా అనుకుంటారు.

అందరిలాంటివాడే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు ఆయనకు ఓ కొత్త తలనొప్పి పట్టుకుంది. ఆయన మొదటి బార్య కుమార్తె సారా అలి ఖాన్ ...ఇప్పుడు బీ టౌన్ సర్కిల్స్ లో తన హాట్ అందాలతో దుమ్మురేపుతోంది. అందరూ దాని గురించే మాట్లాడుతుంటే ఆయనకు మింగుడు పడటం లేదట. అలాగని ఆ విషయం పైకి చెప్పలేడు. అయితే ఈ విషయమై ఆమె తల్లి అమృత సింగ్ మాత్రం మండిపడుతోందిట.

బోయ్ ఫ్రెండ్ తో కలిసి..

బోయ్ ఫ్రెండ్ తో కలిసి..

రీసెంట్ గా అమితాబ్ మనవరాలి పుట్టిన రోజు పార్టీకి వెళ్లిన సైఫ్ కుమార్తె సారా..అక్కడ తన సెక్సీ లుక్స్త్ తో దుమ్ము రేపింది. ఎంతలా అంటే...ఆ పార్టీ కువచ్చిన వాళ్లంతా ఆమె గురించే మాట్లాడుకునే సిట్యువేషన్. దాంతో ఆమె హ్యాపీనే . కానీ తండ్రి పరిస్దితి కూడా కాస్త ఆలోచించాలిగా.

కాస్త కంట్రోల్లో పెట్టవయ్యా

కాస్త కంట్రోల్లో పెట్టవయ్యా

ఎక్కడ తన ఫోటోలు మీడియాలో రావు అనుకుందో ఏమో కానీ ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను ఇనిస్ట్రగ్రామ్ లో ఆమె అప్ లోడ్ చేస్తోంది. దాంతో సైఫ్ కుటుంబ పెద్దలు..కాస్త కూతరుని కంట్రోల్లో పెట్టవయ్యా అంటున్నారంటూ బాలీవుడ్ మీడియా రాస్తోంది. వాళ్లు అంటున్నారో లేదో కానీ ఈ విషయంలోకి ఎలాగైనా సైఫ్ ని లాగాలని మీడియా కంకణం కట్టుకుంది.

ప్రేమాయణం జోరుగా

ప్రేమాయణం జోరుగా

మరో ప్రక్క సారా అలీ ఖాన్ మాజీ కేంద్ర మంత్రి షిండే మనవడు వీర్ పహారియా ‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఇద్దరూ గాఢంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న ఇద్దరూ కలిసే అనేక పార్టీలకు హాజరౌతున్నారు.

పదే పదే ...హద్దులు దాటే

పదే పదే ...హద్దులు దాటే

రోడ్లపై ఉండే బండ్లపై వేసే దోశ తినేందుకు తన బాయ్ ఫ్రెండ్ సందేహించడని సారా గర్వంగా చెబుతోంది. వీర్ సున్నిత మనస్కుడని వెల్లడించింది. అతను సున్నిత మనస్కుడు కాదో కానీ ఫలానా వాడితో నేను డేటింగ్ లో ఉన్నా అని చెప్తూ పదేపదే ఫోజులివ్వటం అందరికీ షాక్ ఇస్తోంది. ఇంత చిన్న వయస్సుకే ఇలాంటి యవ్వారాలు ఏంటి అని నోళ్లు నొక్కుకుంటున్నారు.

మనస్సులో కోరిక ఇదే..

మనస్సులో కోరిక ఇదే..

వాస్తవానికి రెండు మూడేళ్ల క్రితమే సారా అలీ ఖాన్ సినిమాల్లోకి వస్తానని, మోడలింగ్ చేస్తానని కుటుంబ సభ్యుల ముందు తన మనసులోని కోరికను బయట పెట్టిందట. అయితే చదువు పూర్తయిన తర్వాతే బాలీవుడ్ ఎంట్రీ అని ఇంట్లో తేల్చి చెప్పడంతో స్టడీస్ మీదనే ఫోకస్ పెట్టిన సారా కొంతకాలంగా అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలోనే ఉంటూ విద్యనభ్యసిస్తోంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు

తాజాగా సారా గ్రాడ్యువేషన్ పూర్తయింది. ఇంట్లో నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.... కొంతకాలంగా అమెరికాలోనే నటనలో శిక్షణ తీసుకుంటోంది. హీరోయిన్ కావాలంటే నటనతో పాటు అందమైన రూపం తప్పనిసరి. పిజిక్ మెయింటెన్స్ మీద కూడా చాలా కేర్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

అప్పట్లో ఇలా..ఇప్పట్లో ఇలా..

అప్పట్లో ఇలా..ఇప్పట్లో ఇలా..

సారా అతి త్వరలో కరణ్ జోహార్ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న సారా.... ఇపుడు సన్నగా మెరుపు తీగలా తయారై సెక్సీ లుక్ లోకి మారింది. తన అందం గురించి అందరికీ తెలియలనే తపనతో ఫోటోలను ఇంటర్నెట్లో ఫోస్టు చేసింది. ఇపుడు అవి వైరల్ లా షేర్ అవుతున్నాయి.

వేలికి ఉంగరం..

వేలికి ఉంగరం..

సారాకు ఎంగేజ్‌మెంట్ అయినట్టు ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. సారా వేలికి ఉంగరం కనిపించడంతో వీర్ తో ఆమెకు ఎంగేజ్‌మెంట్ అయిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇంకో సంగతి ఏంటంటే... సారా అలీఖాన్ మూవీ ఎంట్రీ ఇవ్వవచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి సైఫ్ అలీఖాన్ ఏం చేస్తాడు? కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడా? లేక బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్నది తేలాల్సి ఉంది.

త్వరలోనే ఓ క్లారిటీ..

త్వరలోనే ఓ క్లారిటీ..

మరో వైపు సారాను హీరోయిన్ పరిచయం చేసేందుకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆమెను తన సినిమా ద్వారా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఆమె సినిమా తెరంగ్రేటం విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నిజమే కానీ..

నిజమే కానీ..

సారా సినిమాల్లోకి రావడంపై సైఫ్... సారా సినిమాల్లోకి రావాలనే కోరికతో ఉన్న మాట నిజమే అని సైఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ముందు చదువు పూర్తి చేయమని చెప్పాను. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో కెరీర్ ఎంచుకున్నా, మరే రంగంలో కెరీర్ ఎంచుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ తెలిపారు. తన సోదరి సోహా అలీ ఖాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందిందని, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చిందని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.

విడాకులు తీసుకున్నాకే..

విడాకులు తీసుకున్నాకే..

బాలీవుడ్ నటి అమృతా సింగ్‌ను 1991 అక్టోబర్‌లో వివాహమాడాక వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. ఆ కుమార్తే ఈ సారా అలీఖాన్. అమృతా సింగ్‌తో విడాకులు తీసుకున్నాక సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు.

తల్లి, తండ్రి కూడా...

తల్లి, తండ్రి కూడా...

సైఫ్ ఆల్రెడీ సినిమా కుటుంబం నుండి వచ్చినవాడే. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ నిన్నటితరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కూడా హీరోయినే. సైఫ్ రెండో భార్య కరీనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్. సైఫ్ సోదరి సోహా అలీ ఖాన్ కూడా బాలీవుడ్ నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబం నేపథ్యం, పెరిగిన ప్రపంచం అంతా కూడా సినిమానే కావడంతో సారా కూడా ఇటు వైపే అడుగులు వేసింది. సారా తల్లి అమృత సింగ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్లో హీరోయిన్ గా నటించింది. సైఫ్ ఫ్యామిలీ అంతా కూడా సినిమాల్లో ఉండటంతో ఆ ప్రభావం సారాపై కూడా పడింది.

Read in English:
English summary
Saif Ali Khan daughter Sara Ali Khan was seen at the birthday bash of Amitabh Bachchan's granddaughter Navya Naveli Nanda and undoubtedly looked hotter than the birthday girl! Check out her latest pictures below..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu