స్టాలిన్ రీమేక్: జైహోలో సల్మాన్ న్యూ అవతార్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'జైహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబందించిన సల్మాన్ ఖాన్ న్యూ అవతార్ ఫోటో రిలీజైంది. అందుకు సంబంధించిన ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ చిత్రంలో సల్మాన్ పూర్తి మాస్ హీరోగా ప్రేక్షకులను అలరించబోతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి జిరాక్స్ కాపీ. స్టాలిన్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు సల్మాన్ హీరోగా 'జైహో' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జైహో'గా మార్చారు.
స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

సల్మాన్ ఖాన్
జై హో మూవీ సెట్లో అభిమానితో కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చిన సల్మాన్ ఖాన్

బైకుపై సల్మాన్
జై హో షూటింగులో భాగంగా బైక్ రైడ్ చేస్తున్న సల్మాన్ ఖాన్‌ను ఇక్కడ చూడొచ్చు.

సల్మాన్-సనా ఖాన్
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్, నటి, మోడల్ సనా ఖాన్ జైహో చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది.

జైహో ఫేక్ పోస్టర్
ఇది జై హో చిత్రం ఫేక్ పోస్ట్. నెట్లో ఇది హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకైతే అఫీషియల్ పోస్టర్ విడుదల కాలేదు.

జైహో సెట్స్
జైహో మూవీ సెట్స్‌లో సల్మాన్ ఖాన్


Click it and Unblock the Notifications











