పెళ్లి తర్వాత తొలిసారిగా పబ్లిక్‌లోకి హాట్ హీరోయిన్ (ఫోటోలు)
ముంబై: హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల ముంబైకి చెందిన బిజినెస్ మేన్ అక్షయ్ వర్దేను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జనవరిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సమీరా రెడ్డి బయట ఎక్కడ కనిపించలేదు. భర్తతో హనీమూన్ ఎంజ్ చేసేందుకు విదేశాలకు వెళ్లింది. దాదాపు నెలన్నర గ్యాప్ తర్వాత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా బర్త్ డే పార్టీలో దర్శనమిచ్చింది సమీరా. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

బర్త్ డే పార్టీలో సమీరా రెడ్డి
బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా బర్త్ డే పార్టీ సందర్భంగా సమీరా రెడ్డి హాజరైంది. నీతా లుల్లా 50వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

సోనాల్ చౌహాన్
బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘లెజెండ్' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సోనాల్ చౌహాన్ కూడా నీతా లుల్లా బర్త్ డే కార్యక్రమానికి హాజరైంది.

హేమా మాలిని
నిన్నటితరం ప్రముఖ నటి, నీతా లుల్లాకు అత్యంత సన్నిహితురాలైన హేమా మాలిని కూడా ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.

హేమా మాలిని-నీతా లుల్లా
బాలీవుడ్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన హేమా మాలిని, నీతా లుల్లా బర్త్ డే పార్టీ సందర్భంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కల్కి కొచ్లిన్
బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ డిజైన్ నీతా లుల్లా బర్త్ డే పార్టీ సందర్భంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

సమీర్ సిస్టర్ సుష్మా
నీతా లుల్లా బర్త్ డే పార్టీకి సమీరారెడ్డి సోదరి సుష్మా కూడా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











