అర్ధరాత్రి హీరో ఇంటిముందు బారులు తీరిన ఫ్యాన్స్ (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఆదివారం 49వ వసంతంలోకి అడుగు పెట్టారు. షారుక్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు భారీగా శనివారం అర్ధరాత్రే ముంబైలోని ఆయన నివాస్ ‘మన్నత్' వద్దకు చేరుకున్నారు. వేలాది మంది అభిమానులు మన్నత్ ముందు గుమికూడి అందరి కంటే ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తన కోసం భారీగా వచ్చన అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా ఇంటి బయటకు వారి ముందుకు వచ్చి వారి శుభాకాంక్షలను స్వీకరించారు షారుక్. అభిమానులు తన కోసం ఇక్కడి వరకు వచ్చి విష్ చేయడాన్ని ఎప్పటికీ మరిచి పోలేనని షారుక్ ఖాన్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా షారుక్ తన వచ్చే ఏడాది జరిగే తన 50వ బర్త్ డే గురించి మాట్లాడారు. ‘వచ్చే ఏడాది తాను 50వ వడిలోకి అడుగు పెడుతున్నాను. ఇది ఎంతో స్పెషల్ గా ఉంటుందన్నారు.'. తన 49వ బర్త్ డే గురించి అడ్డగా...‘నేనెప్పుడూ నా వయసును లెక్కించుకోను. ఫీల్ గుడ్‌గా ఉన్నాను. నవంబర్ 4 నుండి ‘ఫ్యాన్' షూటింగులో పాల్గొంటున్నాను' అని తెలిపారు.

హ్యాపీ న్యూఇయర్ చిత్రం విజయంతో షారుక్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువయింది. ‘గతంలో అర్ధరాత్రి పూట ఏడెనిమిది మంది ఇక్కడికి వచ్చి నా బర్త్ డే సెలబ్రేట్ చేసే వారు. ఇపుడు ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరిగింది. మీడియా కూడా వచ్చింది' అని షారుక్ అన్నారు.

థాంక్స్ చెప్పిన షారుక్

థాంక్స్ చెప్పిన షారుక్

‘చాలా మంది అభిమానులు మన్నత్ వద్దకు వచ్చారు. నా బర్త్ డే జరిపిన ఫ్యాన్స్ అందరికీ థాంక్స్' అంటూ ట్వీట్ చేసారు.

అర్దరాత్రి

అర్దరాత్రి

వేలాది మంది అభిమానులు షారుక్ పుట్టినరోజు సందర్భంగా మన్నత్ వద్దకు చేరుకున్నారు.

అభిమానులను కలిసిన షారుక్

అభిమానులను కలిసిన షారుక్

తన కోసం వచ్చిన అభిమానులను షారుక్ ఇలా బయటకు వచ్చి కలిసారు.

ఫ్యాన్స్ లవ్

ఫ్యాన్స్ లవ్

షారుక్ పుట్టినరోజైన నిన్నంతా అభిమానులు మన్నత్ వద్దకు వచ్చి వెళ్లారు.

షారుఖ్ ఖాన్ ట్వీట్

షారుఖ్ ఖాన్ ట్వీట్

డే అండ్ నైట్ అభిమానులు వస్తూనే ఉన్నారు. వాళ్లు వచ్చి నా బర్త్ డే సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది అంటూ షారుక్ ట్వీట్ చేసారు.

షారుక్ ఫ్లయింగ్ కిస్

షారుక్ ఫ్లయింగ్ కిస్

షారుక్ తన అభిమానులకు ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.

షారుక్ ఖాన్ హ్యాపీ

షారుక్ ఖాన్ హ్యాపీ

భారీగా వచ్చిన అభిమానులను చూసి షారుక్ ఖాన్ ఉప్పొంగి పోయాడు. తన జీవితానికి ఇది చాలు అంటూ ట్వీట్ చేసారు.

నిజమైన హ్యాపీ న్యూ ఇయర్

నిజమైన హ్యాపీ న్యూ ఇయర్

ఇంత మంది అభిమానులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇదే నాకు నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు.

షారుక్ శాల్యూట్

షారుక్ శాల్యూట్

భారీగా తరలి వచ్చిన అభిమానులకు షారుక్ ఖాన్ ఇలా శాల్యూట్ చేసారు.

‘ఇంత మంది రావడం గ్రేట్ ఫీలింగ్. అయితే నేనంత గొప్పవాడిని కాదు. చాలా చిన్న వాడిని. మీ ఆశీర్వాదాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నాలాంటి జీవితం ఉండాలని కోరుకుంటున్నాను' అన్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X