పిక్చర్స్: కోడైకెనాల్‌లో చైనా సృష్టించిన శంకర్

By Pratap

కోడైకెనాల్: అత్యంత ఖరీదుతో అబ్బురపరిచే సెట్లను వేయించడంలో దర్శకుడు శంకర్‌ది అందె వేసిన చేయి. తాజాగా ఆయన ఐ సినమా కోసం కోడైకెనాల్‌లో చైనాను సృష్టించారు. ఐ సినిమాలో విక్రమ్, ఆమీ జాక్సన్ నటిస్తున్నారు. బహు భాషా చిత్రం ఐ కోసం అన్నియన్ కోడైకెనాల్‌లో చైనాను సృష్టించాడు. ఈ మేరకు సెట్ వేశాడు.

చాలా మంది కోడైకెనాల్‌లో చైనాను రిక్రియేట్ చేశారా అని అడుగుతున్నారని, దానికి 150 కోట్లు ఖర్చయిందా అని ప్రశ్నిస్తున్నారని, చైనాలోని అన్ని లోకేషన్స్‌లో షూటింగ్‌కు అనుమతి లభించిందని, ప్రణాళిక ప్రకారం షూటింగ్ పూర్తి చేశామని శంకర్ వెబ్‌సైట్‌లో రాశాడు. కోడైకెనాల్ దృశ్యాలు పూర్తిగా భిన్నమైవని, బడ్జెట్ వంద కోట్ల కన్నా తక్కువే ఉంటుందని ఆయన అన్నారు.

బిజీ షెడ్యూల్స్ గురించి చెబుతూ నిజంగా అలసిపోయానని, మార్చి 15 నుంచి వరుసగా షూటింగ్ జరుగుతోందని, నాలుగు పాటలతో పాటు మూడింట రెండు వంతుల షూటింగ్ పూర్తి చేశామని, మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు, చాలా దృశ్యాలు చైనా చైనా చుట్టూ, బ్యాంగ్‌కాక్, జోధపూర్, కోడైకెనాల్‌, పోలాచీ, చెన్నైలో చిత్రీకరించామని ఆయన వివరించారు. ఎంథిరాన్‌లో స్టాన్ వింట్సన్ స్టూడియో పోషించినటువంటి ముఖ్య పాత్రను వేటా ఐలో పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పిక్చర్స్: కోడైకెనాల్‌లో చైనా సృష్టించిన శంకర్

విక్రమ్‌పై ఓ పాటను ప్రారంభంలో షూట్ చేశామని, వేటా వర్క్‌షాప్ ఆర్టిస్టు సీన్ ఫూట్ చేసిన మేకప్‌లో విక్రమ్ కనిపిస్తాడని, విక్రమ్ టాప్ క్లాస్ ప్రదర్శన కనబరిచాడని శంకర్ అన్నారు.

 పిక్చర్స్: కోడైకెనాల్‌లో చైనా సృష్టించిన శంకర్

వేటా అద్భుతమైన పని చేసినట్లు, అది ఇండియన్ సినిమాకు కొత్తదని శంకర్ అన్నారు. ఎఆర్ రెహ్మాన్ వండర్‌ఫుల్‌గా కబిలాన్ రాసిన పాటను కంపోజ్ చేశాడని అన్నారు ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ వేసిన సెట్లో దాన్ని చిత్రీకరించామని చెప్పారు.

 పిక్చర్స్: కోడైకెనాల్‌లో చైనా సృష్టించిన శంకర్

తమ నిర్మాత రవి సార్‌కు పాటలంటే అమితమైన ఆసక్తి అని, ఆ పాట చిత్రీకరణ సమయంలో చాలా సేపు ఉన్నారని, చూడడానికి ఇది అద్భుతంగా ఉంటుందని శంకర్ అన్నారు.

 పిక్చర్స్: కోడైకెనాల్‌లో చైనా సృష్టించిన శంకర్

మిగతా మూడింట ఒక వంతు సినిమా నిర్మాణం వేటా వర్క్‌షాప్ క్రాఫ్ట్‌తో సాగుతుందని శంకర్ చెప్పారు.

 పిక్చర్స్: కోడైకెనాల్‌లో చైనా సృష్టించిన శంకర్

ప్రాజెక్టు కోసం కొంత మంది హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారని శంకర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X