అనుష్క-విరాట్ కోహ్లి పెళ్లి జరిగే ప్రదేశం ఇదే.... (ఫోటోస్)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి డిసెంబర్ 15న ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇటలీలోని టుస్కానీ అనే అందమైన ప్రదేశంలో వీరి పెళ్లి వేడుక జరుగబోతోంది.
ఈ పెళ్లి వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అనుష్క, విరాట్ కోహ్లి ఫ్యామిలీ మెంబర్స్ఇటలీ చేరుకున్నారు. వీరి పెళ్లి జరిగే ప్రదేశానికి సంబంధించిన ఫోటోస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. వాటిపై మనమూ ఓ లుక్కేద్దాం...

అత్యంత ఖరీదైన వెడ్డింగ్
ఇటలీలోని టుస్కానీ ప్రాంతంలో జరిగే ఈ వెడ్డింగ్ అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌గా రికార్డులకెక్కబోతోంది. ఈ వేడుక కోసం అనుష్క, కోహ్లి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఇరు వర్గాల కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 200 మంది ఈ వేడుకలో పాల్గొన బోతున్నారు.

వెడ్డింగ్ వెన్యూకు వెళ్లే రహదారి
అనుష్క, కోహ్లి వెడ్డింగ్ జరిగే టుస్కానీ ప్రాంతానికి వెళ్లే రహదారి ఇదే. అక్కడున్న వైన్ యార్డుల మీదుగా వెడ్డింగ్ వెన్యూకు వెళ్లాల్సి ఉంటుంది.

గెస్టులు ఉండటానికి బంగ్లా
అనుష్క, కోహ్లి వివాహం జరిగే ప్రాంతంలో అతిథులు బస చేసే బంగ్లా ఇదే. పాతకాలం నాటి కట్టడాన్ని కొంతకాలం క్రితం మోడర్న్ విల్లాగా మార్చి ఖరీదైన వివాహాలు జరుపుకునేందుకు అనువుగా మార్చారు.

అతిథుల కోసం విందు ఇక్కడే
పెళ్లి వేడుకలో పాల్గొనే అతిథుల కోసం విందు ఏర్పాటు చేసే ప్రాంతం ఇదే. ప్రత్యేకమైన వంటకాలతో పాటు ఖరీదైన వైన్ కూడా మెనూలో చేర్చినట్లు తెలుస్తోంది.

అనుష్క, విరాట్ బస చేసే ప్రాంతంలో
అనుష్క, విరాట్ కోహ్లి బస చేసే మెయిన్ విల్లా ఆవరణలో నుండి చూస్తే ఇలా ప్రకృతి రమణీయమైన అందాలు కనువిందు చేస్తాయి.

స్విమ్మింగ్ ఫూల్స్
అనుష్క, విరాట్ పెళ్లి వేడుక జరిగే ప్రాంతంలో ఇలాంటి పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ రెండు ఉన్నాయి. ఎంతో బ్యూటిఫుల్‌గా ఈ స్విమ్మింగ్ ఫూల్ డిజైన్ చేశారు.

బెలూన్ రైడ్ లాంటి అడ్వంచర్స్ కూడా
అనుష్క, విరాట్ పెళ్లి వేడుక జరిగే ప్రాంతంలో హాట్ బెలూన్ రైడ్ లాంటి అడ్వంచర్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. అనుష్క, కోహ్లి వెడ్డింగులో ఈ బెలూన్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్.

అతిథులు బసచేసే విల్లా
అనుష్క, విరాట్ కోహ్లి పెళ్లి వేడుకకు హాజరయ్యే గెస్టులు బసచేసే విల్లా క్లోజప్ లుక్. అందమైన ల్యాండ్ స్కేప్, పాతకాలం నాటి ఆర్కిటెక్చర్‌తో విల్లా ఎంతో అందంగా ఉంది.

పెళ్లి ఫంక్షన్ జరిగేది ఇక్కడే
అనుష్క, విరాట్ కోహ్లి పెళ్లి ఫంక్షన్ జరిగేది ఇక్కడే. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ వెడ్డింగ్ వెన్యూ ఫోటోస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఏరియాల్ వ్యూ
అనుష్క, విరాట్ కోహ్లి వివాహం జరిగే టుస్కానీ వెడ్డింగ్ వెన్యూ ప్రాంతం ఏరియల్ వ్యూ.


Click it and Unblock the Notifications











