అయ్యో.. డ్రెస్ జారిపోతోందే!(హీరోయిన్ పాట్లు, ఫోటోలతో)
హైదరాబాద్: 'నువ్విలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ యామి గౌతమి. ఇటీవల ఈ బ్యూటీ జీ సినీ అవార్డ్స్ కార్యక్రమానికి హాట్ అండ్ సెక్సీ డ్రెస్ లో హాజరైంది. మరి టైలర్ సరిగా కొట్టలేదో? ఈవిడ ఎద అందాలు అందులో సరిగా ఇమడ లేక పోయాయో ఏమో? తెలియదు కానీ.... అక్కడికి వచ్చాక ఆ డ్రెస్ ఆమె మాట వినడం మానేసింది.
నీ ఎద అందాలను కాపాడటం నా వల్ల కాదంటూ మారాం చేసింది. చిటీకి మాటికి జారి పోవడం మొదలైంది. పాపం ఫంక్షన్ అయిపోయేంత సేపు, చివరికి మీడియాతో మాట్లాడేప్పుడూ కూడా డ్రెస్ ను జారిపోనివ్వకుండా, తనప ఎద అందాలు బయట పడి పరువు పోకుండా అపసోపాలు పడింది యామి గౌతమి. ఆ దృశ్యాలు క్రింది స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
గతంలో యామి గౌతమి రవిబాబు దర్శకత్వంలో 'నువ్విలా' చిత్రంలో నటించింది. ఈచిత్రం షూటింగ్ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఇద్దరూ ఒకే హోటల్‌లో స్టే చేసారు. అప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటన రవిబాబుకు వివరించగా దాన్నే ఆయన 'అవును' పేరుతో సినిమా రూపంలోకి తెచ్చారు.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న 'గౌరవం' చిత్రం కాగా, మరొకటి నితిన్ హీరోగా రూపొందబోయే కొరియర్ బాయ్ కళ్యాణ్. గౌరవం చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్ నిర్మాత. కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తుండగా, గౌతం మీనన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

జీ సినీ అవార్డ్ ఫంక్షన్ కి యామి గౌతమి అదిరిపోయే హాట్ అండ్ సెక్సీ డ్రెస్ లో హాజరైంది.

జారిపోతున్న డ్రెస్‌ను సరి చేసుకుంటున్న యామి గౌతమి.

డ్రెస్ జారి ఎద అందాలు బయట పడితే పరువుపోతుందనే భయం ఆమెలో కనిపించింది.

యామి గౌతమి ప్రస్తుతం పలు తెలుగు, తమిళం, హిందీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం యామి గౌతమి తెలుగులో గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











